The Girlfriend Trailer: రష్మిక “ది గర్ల్ ఫ్రెండ్” ట్రైలర్ వచ్చేసింది.. ఫుల్ ఆన్ ఎమోషనల్ రైడ్..
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్"(The Girlfriend Trailer). చిలాసౌ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
Rashmika Mandanna The Girlfriend movie trailer released
The Girlfriend Trailer: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”. చిలాసౌ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్ కీ రోల్స్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగానే తాజాగా “ది గర్ల్ ఫ్రెండ్” ట్రైలర్(The Girlfriend Trailer) విడుదల చేశారు మేకర్స్. “మనం చిన్న బ్రేక్ తీసుకుందామా.. ” అంటూ రష్మిక చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. మిగతా అంతా చాలా ఎమోషనల్ కంటెంట్ తో సాగింది. రష్మిక నటన చాలా కొత్తగా ఉంది. యూత్ ఫుల్ కంటెంట్ ఉంటూనే ఎమోషనల్ పాయింట్ ని ఈ సినిమాలో చెప్పబోతున్నారు అని అర్థమవుతోంది. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.
