Rashmika Mandanna : బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్స్ కాంట్రవర్సీపై స్పందించిన రష్మిక..

నేషనల్ క్రష్ రష్మిక మందన నార్త్ టు సౌత్ వరుస ఆఫర్లు అందుకుంటూ నెంబర్ వన్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. కాగా ఇటీవల మిషన్ మజ్ను మూవీ ప్రమోషన్స్ లో సౌత్ సినిమాల పై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది. తాజాగా దీని పై వివరణ ఇచ్చింది రష్మిక.

Rashmika Mandanna : బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్స్ కాంట్రవర్సీపై స్పందించిన రష్మిక..

Rashmika Mandanna

Updated On : January 19, 2023 / 1:55 PM IST

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రరష్మిక మందన్న నార్త్ టు సౌత్ వరుస ఆఫర్లు అందుకుంటూ నెంబర్ వన్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో పుష్ప-2 సినిమాలో నటిస్తుండగా, హిందీలో మిషన్ మజ్ను, యానిమల్ సినిమాల్లో నటిస్తుంది. వీటిలో పుష్ప-2, యానిమల్ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉండగా.. మిషన్ మజ్ను విడుదలకు సిద్దమవుతుంది. సిద్దార్ధ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ చిత్రం స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వస్తుంది. ఈ మూవీ ఈ నెల 20న డైరెక్ట్ ఓటిటిలో విడుదల కాబోతుంది.

Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో మాల్దీవ్స్ ట్రిప్స్ పై రష్మిక కామెంట్స్..

ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బి టౌన్ లో తెగ సందడి చేస్తుంది ఈ భామ. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఒక ప్రమోషన్ వేదికపై సౌత్ సినిమాల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రొమాంటిక్ సాంగ్స్ అంటే బాలీవుడ్ సాంగ్స్. సౌత్ లో ఏమో మాస్ మసాలా ఐటెం సాంగ్స్ అంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది. తాజాగా దీని పై వివరణ ఇచ్చింది రష్మిక. నేను ఆ వ్యాఖ్యలు అన్నది నిజమే, కానీ నేను అనుకున్నది మొత్తం అక్కడ చెప్పనివ్వలేదు అందుకే అది కాంట్రవర్సీ అయ్యింది అంటూ చెప్పుకొచ్చింది.

‘సౌత్ లో మాస్ మసాలా ఐటెం సాంగ్స్ అని చెప్పగానే స్టేజి మీద ఉన్న వారు.. మాకు అర్ధమైంది అని నన్ను ఆపేశారు. కానీ నేను ఏమి చెప్పాలి అనుకున్నాను అనేది అక్కడ ఎవరు వినలేదు. అసలు నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే.. ఒకప్పుడు రొమాంటిక్ సాంగ్స్ అంటే బాలీవుడ్. ఇప్పుడు సౌత్ లో మాస్ మసాలా ఐటెం సాంగ్స్ తో పాటు రొమాంటిక్ సాంగ్స్ కూడా వస్తున్నాయి. వాటిలో నేను చేసినవి చాలా సాంగ్స్ శ్రీవల్లి, ఇంకేం ఇంకేం కావాలే, చూసి చూడంగానే పాటలు చాలా పెద్ద హిట్టు అయ్యాయి అని చెప్పబోతుంటే ఆపేశారు. దీంతో అది కాస్తా కాంట్రవర్సీకి దారి తీసింది’ అంటూ చెప్పుకొచ్చింది.