CAP MOVIE TRAILER : ‘కాప్’ మూవీ ట్రైలర్ చూశారా.. పొలిటికల్ సెటైర్స్ తో..

పొలిటికల్ సెటైర్స్ తో 'కాప్' మూవీ ట్రైలర్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. మీరు చూశారా..?

CAP MOVIE TRAILER : ‘కాప్’ మూవీ ట్రైలర్ చూశారా.. పొలిటికల్ సెటైర్స్ తో..

Ravi Shankar Somasundaram CAP MOVIE TRAILER released

Updated On : April 14, 2024 / 11:24 AM IST

CAP MOVIE TRAILER : శత్రుపురం, మన్యం రాజు సినిమాలను డైరెక్ట్ చేసి మంచి గుర్తింపుని సంపాదించుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ బి. సోముసుందరం.. ఇప్పుడు ఓ పిలిటికల్ సెటైరకల్ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమాకి “కాప్” అనే టైటిల్ ని పెట్టారు. డబ్బింగ్ స్టార్ రవిశంకర్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. నిఖిల్, రాజశేఖర్, తేజ హీరోలుగా నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు.

ఈ ట్రైలర్ ని తిరుపతి ఎస్ వి ఇంజినీరింగ్ కాలేజ్ లో వందలాదిమంది స్టూడెంట్స్ మధ్య రిలీజ్ చేసారు. ట్రైలర్ చూస్తుంటే మూవీ పొలిటికల్స్ సెటైర్స్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఓ మెసేజ్ ఓరియంటెడ్ మూవీని కమర్షియల్ ఫార్మాట్ లో రూపొందించి తీసుకు వస్తున్నారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు అందర్నీ ఆలోచింపదిస్తాయి అని మేకర్స్ చెబుతున్నారు. స్వశ్రీ క్రియేషన్స్- వాయుపుత్ర ఆర్ట్స్ బ్యానర్స్ పై యువ వ్యాపార వేత్త మాధవన్ సురేష్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మిలన్ జోషి సంగీతం అందిస్తున్నారు.

Also read : Jithender Reddy : ‘జితేందర్ రెడ్డి’ మూవీ నుంచి యూత్ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్..