khiladi shooting : ఇటలీలో ఖిలాడీ…పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్

మాస్ మహారాజా రవితేజ సినిమాల స్పీడ్ పెంచేశారు. అస్సలు గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్ని లైన్లో పెట్టిన రవితేజ..ఖిలాడీలో స్మార్ట్ గా తన ఆటను చూపించబోతున్నారు.

khiladi shooting : ఇటలీలో ఖిలాడీ…పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్

Italy

Updated On : March 25, 2021 / 7:49 PM IST

ravi teja movie : మాస్ మహారాజా రవితేజ సినిమాల స్పీడ్ పెంచేశారు. అస్సలు గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్ని లైన్లో పెట్టిన రవితేజ..ఖిలాడీలో స్మార్ట్ గా తన ఆటను చూపించబోతున్నారు. రమేష్ వర్మ డైరెక్షన్లో రవితేజ డ్యూయల్ రోల్ లో డబుల్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ తో రాబోతున్న సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లోఉంది. డింపుల్ హయాతి హీరోయిన్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ షూటింగ్ ఇటలీ లో జరుగుతోంది. హై ఇంటెన్సిటీ యాక్షన్ ఎలివేటెడ్ లొకేషన్స్ లో పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ ని ట్రెయిన్డ్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ తో షూటింగ్ చేస్తున్నారు రవితేజ.

క్రాక్ లో యాక్షన్ తో ఎంటర్ టైన్ చేసిన రవితేజ ..ఖిలాడీ సినిమాలో ఆ డోస్ ని డబుల్ చేసి చూపించబోతున్నారు. ఖిలాడీ ఇటలీ షూటింగ్ కి సంబందించి టీమ్ రిలీజ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. బ్యాక్ టూ బ్యాక్ షూట్స్ తో మాస్ మహారాజా మళ్లీ తన సక్సెస్ జర్నీ స్టార్ట్ చేశారంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు..

 

View this post on Instagram

 

A post shared by RAVI TEJA (@raviteja_2628)

 

View this post on Instagram

 

A post shared by RAVI TEJA (@raviteja_2628)