Bigg Boss 5: మళ్ళీ హౌస్‌లోకి రవి రీఎంట్రీ.. నిజమెంత?
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ చివరి దశకి వచ్చేసింది. హౌస్ లో పదమూడో వారంలోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో శ్రీరామచంద్ర ఇప్పటికే ఫైనల్ కు చేరుకున్నారు.
Bigg Boss 5: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ చివరి దశకి వచ్చేసింది. హౌస్ లో పదమూడో వారంలోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో శ్రీరామచంద్ర ఇప్పటికే ఫైనల్ కు చేరుకున్నారు. హౌస్‌లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు వెళ్లగా ఇప్పుడు కేవలం ఏడుగురు మాత్రమే ఉండగా.. అందులో ఈ వారం మరొకరు బయటకి విచ్చేయనున్నారు. మిగతా వారిలో ఎవరు టైటిల్ విన్నర్ అన్నది ఆసక్తిగా మారగా.. ఫైనల్ కి చేరుకున్న శ్రీరామచంద్రతో పాటు షణ్ముఖ్, మానస్, సన్నీ, సిరిల మధ్య గట్టి పోటీ నెలకొంది.
OTT Films: బాలీవుడ్ సినిమాలపై ఓటీటీల స్పెషల్ ఇంట్రెస్ట్..!
కాగా, టాప్-5లో ఖచ్చితంగా ఉంటాడనుకున్న రవి గత వారం అనూహ్యంగా ఎలిమినేట్ కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే. రవిది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని, కావాలనే రవిని హౌస్ నుంచి బయటకు పంపించారని భారీ ఎత్తున ఆరోపణలు రాగా.. రవి అభిమానులైతే బిగ్ బాస్ హౌస్ సెట్ ఉన్న అన్నపూర్ణ స్టూడియో బయట ఆందోళన కూడా చేశారు. దీంతో రవిని మళ్లీ బిగ్‌బాస్‌లోకి తీసుకోవాలని నిర్వాహకులు అనుకుంటున్నట్టు గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగిపోతుంది.
Omicron: ఒమిక్రాన్ గురించి 1963లోనే సినిమా.. నిజమేంటంటే
నిజానికి ఇంతకు ముందు నాలుగు ఎపిసోడ్స్ మాదిరి ఇప్పటివరకు ఈ సీజన్లో రీ ఎంట్రీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేవి జరగలేదు. దీంతో రవిని రీఎంట్రీగా పంపించాలని షో నిర్వాహకులు ప్లాన్ చేశారని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, ఇది ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే ఈ వీకెండ్ ఎపిసోడ్ వరకు వేచి చూడాలి. కానీ.. షో ఇప్పటికే చివరి దశకి వచ్చేసింది. ఇంకో ఒక్క ఎలిమినేషన్ మాత్రమే ఉండగా ఆ తర్వాత ఫైనల్స్ వచ్చేస్తాయి. దీనికి బట్టి చూస్తే రవి రీఎంట్రీ కేవలం సోషల్ మీడియా సృష్టిగానే కనిపిస్తుందని చెప్పొచ్చు. కానీ, బిగ్ బాస్ తలచుకుంటే ఏదైనా జరగొచ్చు.