Oka Padakam Prakaram: మాస్ రాజా చేతుల మీదుగా ఒక పథకం ప్రకారం టీజర్
సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్ జంటగా వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఒక పథకం ప్రకారం.....

Raviteja Launches Oka Padakam Prakaram Teaser
Oka Padakam Prakaram: సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్ జంటగా వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఒక పథకం ప్రకారం. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు విన్నింగ్ దర్శకుడు వినోద్ విజయన్ తెరకెక్కిస్తున్నారు. ఈయనతో పాటు మరో ఐదుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ ఒక పథకం ప్రకారం సినిమా కోసం పని చేస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా వస్తుంది.
ఇందులో రామ రావణ తరహా పాత్రలో నటిస్తున్నారు సాయిరామ్ శంకర్. తాజాగా ఈ చిత్ర టీజర్ మాస్ రాజా రవితేజ చేతుల మీదుగా విడుదలైంది. దీనికి అద్భుతమైన స్పందన వస్తుంది. సినిమా కాన్సెప్టును టీజర్ లోనే చూపించారు మేకర్స్. ఇందులో కొత్తగా కనిపిస్తున్నారు సాయిరామ్ శంకర్. పూర్తిగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గానే ఒక పథకం ప్రకారం వస్తుంది. ఈ చిత్రం కోసం ఆరుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ వర్క్ చేస్తున్నారు. దర్శకుడు వినోద్ విజయన్, ఎడిటిర్, మేకప్ ఆర్టిస్ట్, ప్రొడక్షన్ డిజైనర్ సహా మరో ఇద్దరు జాతీయ అవార్డు గ్రహీతలు ఒక పథకం ప్రకారం సినిమా టీమ్ లో ఉన్నారు.
ఈ సినిమా జూన్ 24న విడుదల కానున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు. మరి ఈ సినిమాతో సాయిరామ్ శంకర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.