Changure Bangaru Raja : మాస్ మహారాజ నిర్మాతగా కొత్త సినిమా.. టీజర్ చూశారా?

తాజాగా రవితేజ తన నిర్మాణంలో ఓ చిన్న సినిమాని నిర్మిస్తున్నాడు. కేరాఫ్ కంచరపాలెం నటుడు కార్తీక్ రత్నం ముఖ్యపాత్రలో ఓ కామెడీ సస్పెన్స్ సినిమాని నిర్మిస్తున్నాడు.

Changure Bangaru Raja : మాస్ మహారాజ నిర్మాతగా కొత్త సినిమా.. టీజర్ చూశారా?

Raviteja Producing movie Changure Bangaru Raja teaser released

Updated On : April 27, 2023 / 8:51 AM IST

Changure Bangaru Raja : మాస్ మహారాజ(Mass Maharaja) రవితేజ(Raviteja) ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ధమాకా(Rhamaka), వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టాడు. రావణాసుర(Ravanasura) సినిమాతో పర్వాలేదనిపించాడు. ఇక నిర్మాతగా కూడా సినిమాలు తీస్తున్నాడు రవితేజ. RT టీమ్ వర్క్స్(RT Team Works) అనే నిర్మాణ సంస్థను స్థాపించి కొన్ని సినిమాలు వేరే ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మిస్తున్నాడు. కొన్ని సినిమాలు సొంతంగా నిర్మిస్తున్నారు. ఇటీవల రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమాకి కూడా రవితేజ నిర్మాతగా వ్యవహరించారు.

తాజాగా రవితేజ తన నిర్మాణంలో ఓ చిన్న సినిమాని నిర్మిస్తున్నాడు. కేరాఫ్ కంచరపాలెం నటుడు కార్తీక్ రత్నం ముఖ్యపాత్రలో ఓ కామెడీ సస్పెన్స్ సినిమాని నిర్మిస్తున్నాడు. సతీష్ వర్మ దర్శకత్వంలో కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సీ, రవిబాబు, సత్య, ఎస్తర్ నోరాన్హా, నిత్యశ్రీ.. పలువురు ముఖ్యపాత్రల్లో ఛాంగురే బంగారు రాజా సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టిజర్ ని రవితేజ లాంచ్ చేశారు

Hero Ram : బోయపాటి కోసం ఏకంగా 80 కేజీల కేక్ తెప్పించిన రామ్..

ముగ్గురు వేరు వేరు స్టోరీలు ఓ మర్డర్ తో కలిసి ఆ మర్డర్ నేరం హీరో మీద పడితే ఏం జరిగింది అనే సస్పెన్స్ కామెడీ అంశంతో చాంగురే బంగారు రాజా తెరకెక్కుతుంది. ఇందులో ఓ కుక్క పాత్ర కూడా ఉంది. దానికి సునీల్ వాయిస్ చెప్పడం విశేషం. టీజర్ ఆ కుక్క పాత్రలో సునీల్ వాయిస్ తోనే మొదలయి ఎండ్ అవుతుంది. టీజర్ చూసిన తర్వాత చిన్న సినిమా అయినా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో రవితేజ మరోసారి నిర్మాతగా సక్సెస్ అవుతాడని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.