Raviteja: వాల్తేరు వీరయ్య కోసం రవితేజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ధమాకా’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక రొటీన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీ ఈస్థాయిలో కలెక్షన్స్ రాబట్టడంతో రవితేజ స్టామినా ఏమిటో ఈ సినిమా ప్రూవ్ చేసిందని అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు.

Raviteja: వాల్తేరు వీరయ్య కోసం రవితేజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Raviteja Remuneration For Waltair Veerayya

Updated On : December 31, 2022 / 9:37 PM IST

Raviteja: మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ధమాకా’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక రొటీన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీ ఈస్థాయిలో కలెక్షన్స్ రాబట్టడంతో రవితేజ స్టామినా ఏమిటో ఈ సినిమా ప్రూవ్ చేసిందని అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు.

Raviteja: సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నా.. కానీ ఫెయిల్ అయ్యింది.. రవితేజ కామెంట్!

ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’లో ఓ కీలక పాత్రలో నటిస్తున్న రవితేజ సంక్రాంతి బరిలో మరోసారి మనముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో రవితేజ పాత్ర నిడివి ఏకంగా 40 నిమిషాల పాటు ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. అయితే తాజాగా ఈ సినిమా కోసం రవితేజ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. సాధారణంగా రవితేజ ఒక్క సినిమాకు రూ.20 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అయితే ‘వాల్తేరు వీరయ్య’లో 40 నిమిషాల నిడివి పాత్ర కోసం ఆయన చిత్ర నిర్మాతలను ఏకంగా రూ.17 కోట్ల మేర డిమాండ్ చేశారట.

Raviteja: మాస్ రాజా ఫ్యాన్స్‌కి ‘ధమాకా’ లాంటి న్యూస్.. త్వరలోనే ఆ సీక్వెల్..?

కాగా, చిత్ర నిర్మాతలు రూ.16 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు ఫిలిం సర్కిల్స్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఆయన పాత్ర సినిమాకు మేజర్ అసెట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తుండగా, చిరంజీవి చాలా రోజుల తరువాత ఊరమాస్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, శ్రుతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.