Ram Mandir Opening Ceremony : వెండితెరపై రామ మందిర ప్రారంభోత్సవం లైవ్.. ఎక్కడ? ఎప్పుడు?
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రముఖ మల్టీప్లెక్స్ థియేటర్లు పీవీఆర్ ఐనాక్స్ ప్రత్యక్ష ప్రసారం ఇవ్వబోతున్నాయి. టిక్కెట్టు ధర.. సమయం వివరాల కోసం చదవండి.
![Ram Mandir Opening Ceremony : వెండితెరపై రామ మందిర ప్రారంభోత్సవం లైవ్.. ఎక్కడ? ఎప్పుడు? Ram Mandir Opening Ceremony : వెండితెరపై రామ మందిర ప్రారంభోత్సవం లైవ్.. ఎక్కడ? ఎప్పుడు?](https://10tv.in/wp-content/uploads/2024/01/New-Project-2-26.jpg)
Ram Mandir Opening Ceremony
Ram Mandir Opening Ceremony : జనవరి 22న అయోధ్యలో జరగబోతున్న రామ మందిర ప్రారంభోత్సవ అపూరూప ఘట్టానికి మరికొన్ని గంటలు సమయం ఉంది. ఆ అద్భుత క్షణాలు వీక్షించడానికి ప్రజలంతా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈ వేడుకను పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు.
Rukmini Vasanth : తెలుగులోకి మరో కన్నడ భామ.. ‘సప్త సాగరాలు దాటి’ హీరోయిన్.. స్టార్ హీరో సరసన..
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం వీక్షించడానికి దేశం యావత్తు ఎదురుచూస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో చూపించడానికి మల్టీప్లెక్స్ దిగ్గజాలు పీవీఆర్ ఐనాక్స్ న్యూస్ ఛానెల్ ఆజ్ తక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈ సంస్థల కో-ఫౌండర్ గౌతమ్ దత్తా వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది భక్తులు వీక్షించేలా తాము అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నామని ఆయన చెప్పారు. ఇప్పటికే ఆన్ లైన్లో టిక్కెట్లు అందుబాటులో ఉంచారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. టికెట్ ధర రూ.100 రూపాయలు కాగా ప్రతి టికెట్‌పై పాప్ కార్న్ కాంబోను కూడా అందిస్తున్నారు. భారతదేశంలోని 160కి పైగా థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Ananyaa : ‘జర్నీ’ హీరోయిన్ ఏమైపోయింది? ఇప్పుడు ఏం చేస్తుంది?
ప్రపంచ వ్యాప్తంగా 11,000 మందికి పైగా అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రజనీకాంత్, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, రణ్‌బీర్ కపూర్, అలియా భట్, మోహన్‌లాల్, ధనుష్ వంటి సినీ సెలబ్రిటీలతో పాటు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. 1987 లో వచ్చిన ‘రామాయణ్’ టీవీ సీరియల్లో శ్రీరాముడు, సీతాదేవి పాత్రల్లో నటించిన అరుణ్ గోవిల్, దీపిక చిక్లియా కూడా ఈ వేడుకలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
Join us for a momentous occasion! Watch the live screening of the Ayodhya Ram Mandir Inauguration at PVR and INOX on January 22nd, 2024.
Secure your seat for this monumental event and enjoy a complimentary popcorn combo with every ticket. *T&C applies.
Book now:… pic.twitter.com/UQaWTEeFME
— P V R C i n e m a s (@_PVRCinemas) January 19, 2024