Maro Prasthanam: రియల్ టైమ్.. రీల్ టైమ్ ఒకటే.. అదే ఈ సినిమా స్పెషాలిటీ!

ఒకప్పుడు వేరు.. ఇప్పుడు వేరు. మూసను వీడిన మన సినీ ఇండస్ట్రీ ఇప్పుడు కొత్త కొత్త ప్రయోగాలకు వేదికవుతుంది. అందుకే పాన్ ఇండియా స్థాయిలో మన సినిమాలకు డిమాండ్ పెరుగుతుంది.

Maro Prasthanam: రియల్ టైమ్.. రీల్ టైమ్ ఒకటే.. అదే ఈ సినిమా స్పెషాలిటీ!

Maro Prasthanam

Updated On : September 11, 2021 / 1:39 PM IST

Maro Prasthanam: ఒకప్పుడు వేరు.. ఇప్పుడు వేరు. మూసను వీడిన మన సినీ ఇండస్ట్రీ ఇప్పుడు కొత్త కొత్త ప్రయోగాలకు వేదికవుతుంది. అందుకే పాన్ ఇండియా స్థాయిలో మన సినిమాలకు డిమాండ్ పెరుగుతుంది. ఇక నచ్చావులే లాంటి సక్సెస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తనీష్ చాలా కాలంగా మంచి సక్సెస్ సినిమా లేక ఇబ్బందులు పడుతున్నాడు. అయినా.. ఓ ప్రయోగానికి సిద్దమయ్యాడు. అదే మరో ప్రస్థానం సినిమా. ఈ సినిమాలో రియల్ టైమ్.. రీల్ టైమ్ ఒకటే ఉంటుంది.

Big Boss 5: వరెస్ట్ కంటెస్టెంట్ పెట్టిన చిచ్చు.. మాటలకు మించి ఇంకేదో!

అంటే సినిమాలో కథ ఎంత టైమ్ జరిగితే సరిగ్గా అదే టైమ్ కు సినిమా కంప్లీట్ అవుతుంది. సింగిల్ షాట్ ప్యాటర్న్ లో ఎలాంటి కట్స్, జర్క్స్, రివైండ్ షాట్స్ లేకుండా స్ట్రైట్ స్క్రీన్ ప్లే తో మరో ప్రస్థానం చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు జాని తెలిపాడు. ఇలా రెగ్యులర్ గా వచ్చే సినిమాలకు పూర్తి భిన్నంగా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓ ఎమోషనల్ కిల్లర్ జర్నీ అని ధీమాగా ఈ సినిమా మేకర్స్ ధీమా ఉన్నారు. కథ, కథనం సరికొత్తగా ఉంటుందని.. సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఉత్కంఠతో చూసేలా డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించామని చెప్పారు.

Naina Ganguly: నైనా.. అసలేంటీ రెచ్చగొట్టడం!

ఇటీవల కాలంలో వచ్చిన కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు మన ప్రేక్షకులు చూపించిన ఆదరణే ఈ సినిమా తెరకెక్కేలా చేసిందని దర్శకుడు చెప్పాడు. ఇందులో తనీష్‌ కు జోడిగా ముస్కాన్ సేథీ నటించగా ఈ నెలాఖరున మరో ప్రస్థానం సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ ఈ సినిమా నిర్మించింది. మరి ఈ సినిమా అయినా తనీష్ ను మళ్ళీ ట్రాక్ మీదకి తీసుకొస్తుందా అన్నది చూడాల్సి ఉంది.