హైకోర్టులో ఆర్జీవీకి ఊరట.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కోర్టు ఆదేశాలు..

  • Published By: sekhar ,Published On : August 25, 2020 / 07:41 PM IST
హైకోర్టులో ఆర్జీవీకి ఊరట.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కోర్టు ఆదేశాలు..

Updated On : August 25, 2020 / 8:26 PM IST

రామ్ గోపాల్ వర్మ ‘మర్డర్’ సినిమా విడుదలను ఆపివెయ్యాలంటూ వచ్చిన వాదనలను పరిశీలించిన నల్గొండ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు సినిమా విడుదలను ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో.. ‘మర్డర్’ సినిమాపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.

సినిమా విడుదలను నిలుపుదల చేయాలని కోరుతూ ప్రణయ్ తండ్రి బాలస్వామి ఎస్సీ,ఎస్టీ కోర్టులో వేసిన పిటిషన్‌పై మర్డర్ చిత్ర దర్శకనిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన హైకోర్టు బాలస్వామి పిటిషన్‌పై స్టే విధించింది.

మర్డర్ చిత్ర దర్శకనిర్మాతలైన రాంగోపాల్ వర్మ, నట్టి కరుణపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో ఆర్జీవీ, నిర్మాత నట్టి కరుణలకు ఊరట లభించింది.