Tiger Nageswara Rao : టైగర్ నాగేశ్వరరావు కోసం చంటిబిడ్డను ఎత్తుకున్న రేణు దేశాయ్
మాస్ మహారాజా రవితేజ (Raviteja) నటిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao). నూతన దర్శకుడు వంశీ డైరెక్షన్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.

Renu Desai character poster from Tiger Nageswara Rao
Tiger Nageswara Rao-Renu Desai : మాస్ మహారాజా రవితేజ (Raviteja) నటిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao). నూతన దర్శకుడు వంశీ డైరెక్షన్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకం పై పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నుపుర్ సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. 1970లో స్టూవర్టుపురానికి చెందిన గజదొంగ టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అక్టోబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Bhagavanth Kesari : భగవంత్ కేసరి సెకండ్ సింగల్ అప్డేట్ ఇచ్చిన బాలయ్య..
ఈ క్రమంలోనే చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. టీజర్, ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి రేణు దేశాయ్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆమె హేమలత లవణం అనే పాత్రలో నటిస్తోంది. ఈ పాత్రకు సంబంధించిన లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో రేణూ.. చేతిలో చంటిపాపను ఎత్తుకుని లాలిస్తున్నట్లు కనపడుతోంది. చాలా రోజుల తరువాత రేణు దేశాయ్ నటిస్తుండడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్షణాల్లోనే ఈ పోస్టర్ వైరల్‌గా మారింది. ఇక ఈ చిత్ర ట్రైలర్‌ను అక్టోబర్ 3న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
View this post on Instagram