Ram Gopal Varma: అమిర్ ఖాన్ విడాకులు.. ఆర్జీవీ సెలబ్రేషన్!

Ram Gopal Varma: అమిర్ ఖాన్ విడాకులు.. ఆర్జీవీ సెలబ్రేషన్!

Ram Gopal Varma

Updated On : July 4, 2021 / 8:41 PM IST

Ram Gopal Varma: ఇకపై కాదేదీ వర్మకు అనర్హం అనాలేమో. ఇండియాలో ఏది జరిగినా దానిపై స్పందించే వ్యక్తి బహుశా రామ్ గోపాల్ వర్మ ఒక్కరేనేమో. ఈ మధ్య కరోనా థర్డ్ వేవ్ మీద కూడా డిబేట్లు పెట్టిన వర్మ ఇక రాజకీయాల నుండి సైన్స్, ఆచారాల వరకు అన్నిటి మీద వర్మ స్పందన ఉండనే ఉంటుంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ విడాకుల విషయంలో కూడా వర్మ ఫింగర్ పెట్టేశాడు.

సహజంగా పెళ్లి, సంసారం అంటే మా చెడ్డ చిరాకని చెప్పే వర్మ అమిర్ ఖాన్ విడాకులు తీసుకొని మంచి పనిచేశాడని వెనకేసుకొచ్చాడు. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన అమిర్ ఖాన్ – కిరణ్ రావుల విడాకుల గురించే హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. వీరి విడాకులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతుండగా వర్మ నెటిజన్ల కామెంట్లపై స్పందించాడు. అసలు వాళ్ళు విడిపోతుంటే మీకెందుకు నొప్పి అంటూ వర్మ ఓ రేంజిలో రెచ్చిపోయాడు.

అసలు నా దృష్టిలో సెలబ్రేట్ చేసుకోవాల్సింది పెళ్లి కాదని.. విడాకులనే ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలన్న వర్మ.. అమీర్ ఖాన్ జంటను దూరంగా ఉంటూ రంగుల మయంగా ఉండాలని కోరుకున్నాడు. విడిపోయిన వాళ్లకు లేని బాధ మీకేంటి అని.. వాళ్లు విడిపోవడానికి సిద్ధమైనప్పుడు మీరెందుకు ఇబ్బందిపడుతున్నారని మండిపడ్డాడు. ఆనందంగా విడిపోలేందుకు సిద్దమైన వాళ్ళని మీరు ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారని నెటిజన్లను ప్రశ్నించాడు.