RGV : ఈ సినిమాలో నేను నమ్మిన నిజం ఉంది.. వేరే వాళ్ళ మీద సినిమా తీయమంటే తీయను..
తాజాగా హైదరాబాద్ దసపల్లా హోటల్ లో వ్యూహం(Vyooham) సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్లో ఆర్జీవీ మాట్లాడుతూ జగన్, చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

RGV Interesting Comments on YS Jagan and Chandrababu and Vyooham Movies
RGV Comments : సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ (Rgv) గతంలో ఎలక్షన్స్ సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ టైంకి వ్యూహం అనే పొలిటికల్ సినిమాతో రాబోతున్నాడు. జగన్ కి సంబంధించిన కథతో వ్యూహం, శపథం అనే రెండు సినిమాలు తెస్తున్నాడు. వైఎస్ జగన్ కి సంబంధించిన ఈ కథలో.. రాజశేఖర్ రెడ్డి చనిపోయాక జగన్ పై జరిగిన కుట్రలు, జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఆ తర్వాత జగన్ సీఎం ఎలా అయ్యారు? సీఎం అయ్యాక ఏం చేశారు అనే అంశాలతో ఈ రెండు సినిమాలు ఉండనున్నాయి. ఇప్పటికే వ్యూహం సినిమా నుంచి టీజర్ విడుదల చేసి ఆసక్తి నెలకొల్పారు.
తాజాగా హైదరాబాద్ దసపల్లా హోటల్ లో వ్యూహం (Vyooham) సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్లో ఆర్జీవీ మాట్లాడుతూ జగన్, చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : ఆర్జీవీ ‘వ్యూహం’ ట్రైలర్ చూశారా?
ఆర్జీవీ మాట్లాడుతూ.. ఈ సినిమా వెనుక ఎలాంటి వ్యూహం ఏమి లేదు, నిజం మాత్రమే ఉంది. వ్యూహం రెండు భాగాలుగా వస్తుంది. వైఎస్ మరణం తరువాత నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలతోఈ రెండు సినిమాలు ఉంటాయి. నేను చాలా సౌమ్యుడుని. నేను ఎప్పుడు చంద్రబాబుని కలవలేదు. నాకు జగన్ గారు అంటే ఒక అభిప్రాయం ఉంది, చంద్రబాబు గారు అంటే ఒక అభిప్రాయం ఉంది. నిజమేంటో ఈ సినిమాలో చూస్తారు. జగన్ గారి మీద నాకు ఉన్న అభిప్రాయం సినిమాలో కనిపిస్తుంది. మిగతా వారిపై నాకు అభిప్రాయం లేదు. నేను వేరే వాళ్ళ మీద సినిమా తియ్యమంటే తియ్యాను.
ఈ సినిమాలో నేను నమ్మిన నిజం ఉంది. పబ్లిక్ డొమైన్ లో ఉన్న జీవితాలను సినిమా తియ్యడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. నేను లక్ష్మిస్ ఎన్టీఆర్, సర్కార్ సినిమాలు అలా తీసినవే. నేను జగన్ గారి మీద ఉన్న అభిమానంతో సినిమా తీసాను కానీ ఇక్కడ ప్యాకేజ్ అనేదానికి ఆస్కారం లేదు. నాకు టీడీపీ, వైసీపీ ఏ పార్టీ గురించి తెలీదు. నా రీసెర్చ్ లో ఏం తెలుసుకున్నాను అనేది ఈ సినిమా. రియలిస్టిక్ సినిమా అంటే అది వాళ్ళ పాయింట్ ఆఫ్ లో ఉంటుంది. ఈ సినిమాలో చాలా పాత్రలు ఉన్నాయి, చిరంజీవి పాత్ర కూడా ఉంది అని తెలిపాడు. దీంతో ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.