I am a Fan of PK.. ఆయణ్ణి సీఎంగా చూడాలనుకుంటున్నా..

రామ్ గోపాల్ వర్మ ఎన్నికల ఫలితాల తర్వాత కథ అంటూ పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ‘పవర్‌స్టార్’ సినిమా తీశాడు. ట్రైలర్, పాటలతో అంచనాలు పెంచేసిన వర్మ ఈరోజు ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో ‘పవర్‌స్టార్’ మూవీని రిలీజ్ చేశాడు. ఈ సినిమా గురించి వర్మకి కౌంటర్‌గా ‘పరాన్నజీవి’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు నూతన్ నాయుడు ‘పరాన్నజీవి’ చిత్రం ప్రకటించాక వర్మ భయపడి ‘పవర్‌స్టార్’ కథ మార్చేశాడని, రీ షూట్ చేశారని మేమనుకున్న వ్యూహం ఫలించింది అని చెప్పారు.
దీనిపై వర్మ స్పందిస్తూ.. తానెవరికీ భయపడే ప్రసక్తి లేదని, తనని ఎవరూ బ్యాన్ చేయలేరని.. స్క్రిప్ట్ మార్చడం, రీ షూట్ చేయడం లాంటివేం జరగలేదని చెప్పారు. నేను పవన్ కళ్యాణ్ అభిమానిని.. ఆయణ్ణి సీఎంగా చూడాలని ఉంది అని గతమూడేళ్లుగా చెబుతున్నానని వర్మ అన్నారు.