RGV : ఏపీ సీఎంతో నాకు పరిచయం లేదు.. వ్యూహం ట్రైలర్ లాంచ్‌లో ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇటీవలే వ్యూహం సినిమాకి సెన్సార్ కూడా క్లియర్ అవ్వడంతో సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టాడు ఆర్జీవి. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్, ట్రైలర్ రిలీజవ్వగా తాజాగా మరో ట్రైలర్ రిలీజ్ చేశారు.

RGV Sensational Comments in Vyooham Movie Trailer Launch
RGV Comments : సంచలన దర్శకుడు ఆర్జీవీ తన సినిమాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఇప్పుడు మరో రెండు సినిమాలతో సెన్సేషన్ సృష్టించబోతున్నారు. వైఎస్సార్ మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చుట్టూ జరిగిన పరిస్థితుల ఆధారంగా డైరెక్టర్ ఆర్జీవీ రెండు పార్టులుగా సినిమా తీస్తున్నారు. మొదటి పార్ట్ ‘వ్యూహం’ సినిమా డిసెంబర్ 29న రిలీజ్ కానుంది. రెండవ పార్ట్ ‘శపథం’ జనవరి 25న రిలీజ్ కానుంది.
ఇటీవలే వ్యూహం సినిమాకి సెన్సార్ కూడా క్లియర్ అవ్వడంతో సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టాడు ఆర్జీవి. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్, ట్రైలర్ రిలీజవ్వగా తాజాగా మరో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ట్రైలర్ లాంచ్ ప్రెస్ మీట్ పెట్టారు ఆర్జీవీ. ఈ ప్రెస్ మీట్ లో ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : జోరుగా హుషారుగా మూవీ రివ్యూ.. ‘బేబీ’ సినిమా విరాజ్ అశ్విన్ హీరోగా మెప్పించాడా?
ఆర్జీవీ మాట్లాడుతూ.. ”అరచేతిని అడ్డుపెట్టి వ్యూహం సినిమాను ఆపలేరు అని గతంలోనే చెప్పాను. రిలిజ్ కు రెడీ అయ్యింది వ్యూహం సినిమా. ఏం మాయచేసి క్లీన్ యు సర్టిఫికెట్ తెచ్చారు అని నన్ను అడగొద్దు. ఏపీ సీఎంతో నాకు పరిచయం లేదు. వైఎస్ఆర్ గారు చనిపోయిన తరువాత ఏం జరిగింది అనే కథే వ్యూహం సినిమా. ఇందులో అన్ని అంశాలను టచ్ చేశాం. గతంలో బయట వాళ్లు మైక్స్ దగ్గర ఏమీ చెప్పారో అదే ప్రజలకు తెలుసు. కానీ వాళ్ల బెడ్ రూమ్, బాత్ రూమ్ విషయాలు చూపించాను. అన్ని క్యారెక్టర్లు ఫిక్షనల్ క్యారెక్టర్స్. నేను ఏమీ చూపించాను అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. వ్యూహం సినిమాను వైఎస్ జగన్ కూడా టికెట్ కొనేచూడాలి. చంద్రబాబుకు మాత్రం ఉచితంగానే చూపిస్తామని” అన్నారు. దీంతో ఆర్జీవీ చేసిన కామెంట్స్ తో పాటు ట్రైలర్ కూడా వైరల్ గా మారింది.