RGV: బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఇనయా కోసం రంగంలోకి దిగిన RGV..

బిగ్‌బాస్ సీజన్ 6 మొదలై మూడు వారలు పూర్తి చేసుకుంటుంది. ఇక బిగ్‌బాస్ అయితే రోజుకో టాస్క్ పెడుతూ ఆటని చాలా రసవత్రంగా నడిపిస్తున్నాడు. దీంతో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు మొదలై ఒకరిపై ఒకరు దూషించుకోవడం మొదలు పెట్టారు. ముఖ్యంగా కంటెస్టెంట్ ఇనాయ ఎవరో ఒకరితో గొడవ పడుతూనే ఉంటుంది.

RGV: బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఇనయా కోసం రంగంలోకి దిగిన RGV..

RGV Support for BiggBoss Contestant Inaya

Updated On : September 24, 2022 / 3:51 PM IST

RGV: బిగ్‌బాస్ సీజన్ 6 మొదలై మూడు వారలు పూర్తి చేసుకుంటుంది. ఇక బిగ్‌బాస్ అయితే రోజుకో టాస్క్ పెడుతూ ఆటని చాలా రసవత్రంగా నడిపిస్తున్నాడు. దీంతో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు మొదలై ఒకరిపై ఒకరు దూషించుకోవడం మొదలు పెట్టారు. ముఖ్యంగా కంటెస్టెంట్ ఇనాయ ఎవరో ఒకరితో గొడవ పడుతూనే ఉంటుంది.

BiggBoss 6 Day 19 : కొత్త బిగ్‌బాస్ కెప్టెన్ ఎవరో తెలుసా.. మళ్ళీ గీతూ హడావిడి..

డైరెక్టర్ రాంగోపాల్ వర్మతో డాన్స్ చేస్తూ ఉన్న వీడియోతో పాపులర్ అయిన ఇనాయ, బిగ్‌బాస్ లో అవకాశం అందిపుచ్చుకుంది. RGV పుణ్యమా అంటూ సింగల్ నైట్ లో పాపులర్ అయిపోయిన ఇనాయ.. ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్ లో ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకుంటూ ప్రతి వారం ఎలిమినేషన్ కు నామినేట్ అవుతూ వస్తుంది.

ఇక ఈ వారం కూడా నామినేషన్ లో నిలవగా, ఆమెను ఎలిమేషన్ నుంచి సేవ్ చేసేందుకు రాంగోపాల్ వర్మ రంగంలోకి దిగాడు. ఆమెకు వోట్ వేసి గెలిపించాలంటూ ట్వీట్ చేశాడు. ఇనాయకు సపోర్ట్ చేయాలంటూ అడుగుతూ.. వోటింగ్ లింక్ ను, నెంబర్ ను పోస్ట్ చేయడమే కాకుండా, వారిద్దరూ కలిసి దిగిన ఫోటోని కూడా పోస్ట్ చేశాడు. మరి చూడాలి RGV సపోర్ట్ ఇనాయకి ఎంతవరకు కలిసి వస్తుందో.