గోవాలో బ్యూటిఫుల్ గర్ల్స్‌తో ఆర్జీవీ!

  • Published By: sekhar ,Published On : October 12, 2020 / 06:12 PM IST
గోవాలో బ్యూటిఫుల్ గర్ల్స్‌తో ఆర్జీవీ!

Updated On : October 12, 2020 / 6:17 PM IST

RGV’s Dangerous Movie: ఆర్జీవీ ఇండియాస్ ఫ‌స్ట్ లెస్బియన్ క్రైమ్ యాక్ష‌న్ ఫిలిం.. ‘డేంజరస్’
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్‌డౌన్, కరోనా వ్యాప్తి సమయంలోనూ తనదైన శైలిలో సినిమాలు తీస్తూ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన సారథ్యంలో ‘బ్యూటిఫుల్’ హీరోయిన్ నైనా గంగూలీ, ‘థ్రిల్లర్’ బ్యూటీ అప్సర రాణి ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న మూవీ ‘డేంజ‌ర‌స్‌’.


ఈ మేరకు ట్విట్టర్ ద్వారా కొన్ని పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఇది ఇండియాలోనే తొలి లెస్బియన్ క్రైమ్ యాక్షన్ ఫిల్మ్ అని, ఈ లెస్బియన్స్ ఎఫైర్ చాలా మందిని చంపేసిందని… వారిలో పోలీసులు, గ్యాంగ్‌స్టర్స్ కూడా ఉన్నారని పోస్టర్‌పై వర్మ తెలిపారు. అలాగే ఇద్దరు బ్యూటీలతో గోవా బీచ్‌లో తీసుకున్న ఫొటోలను కూడా షేర్ చేశాడు ఆర్జీవీ.