‘‘పవర్‌స్టార్’’ ట్రైలర్ రిలీజ్.. వర్మ కనబడితే ఉతికారేస్తామంటున్న పీకే ఫ్యాన్స్..

కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ‘పవర్ స్టార్’ ఎన్నికల ఫలితాల తర్వాత కథ.. అంటూ ఓ సినిమా రూపొందించాడు. ఇటీవలే ఓ పాట విడుదల చేసిన వివాదం రేపిన వర్మ తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశాడు. పవన్ కళ్యాణ్‌కి సినిమాకి సంబంధం లేదు అంటున్నాడు కానీ పవన్ పొలిటికల్ కెరీర్‌పైనే ఫోకస్ చేశాడని అర్థమవుతోంది. ట్రైలర్‌లో చంద్రబాబు, త్రివిక్రమ్, బండ్ల గణేష్ వంటి కొన్ని క్యారెక్టర్లు చూపించాడు.ఈ నెల 25న ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో ‘పవర్ స్టార్’ సినిమా రిలీజ్ చేయనున్నాడు ఆర్జీవీ. ఇక ట్రైలర్ చూసిన పవన్ ఫ్యాన్స్ ఆవేశంతో ఊగిపోతున్నారు. ఒక్క సీటు అంటూ అంటూ తమ హీరోని చులకన చేసి చూపించడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్మ కనుక కంటికి కనిపిస్తే ఉతికి ఆరేస్తాం అంటున్నారు పవన్ వీరాభిమానులు.. ట్రైలర్ లీక్ అయినా కేవలం ఒక గంటలో 200,000 వ్యూస్ వచ్చాయంటూ పోస్టర్ రిలీజ్ చేశాడు వర్మ.