‘Notebook’ : కాశ్మీర్ సమస్యకు సల్లూ భాయ్ సూచన

  • Published By: madhu ,Published On : March 21, 2019 / 10:42 AM IST
‘Notebook’ : కాశ్మీర్ సమస్యకు సల్లూ భాయ్ సూచన

Updated On : March 21, 2019 / 10:42 AM IST

ఏన్నో ఏళ్లుగా ఉన్న కాశ్మీర్ వివాదంపై బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ సూచన చేశాడు. అక్కడ జరుగుతున్న హింస తగ్గాలంటే ఏం చేయాలో చెప్పాడు ఈ హీరో. జస్ట్ కాశ్మీర్ యూత్‌కు సరైన విద్య అందిస్తే చాలు అని ఒక్క ముక్కలో చెప్పాడు. ఇతను నటించిన సినిమాలు ఈజీగా వంద కోట్ల క్లబ్‌లో చేరుతుంటాయి. తాజాగా సల్లూ భాయ్ ‘నోట్ బుక్’ చిత్రంలో నటిస్తున్నాడు. షూటింగ్ జరుపుకుని రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. 
Read Also : ఫోటోకు ఫోజులిస్తే.. ఎత్తి కుదేసిన రాకాసి అల

ఈ సందర్భంగా సల్మాన్ మీడియాతో మాట్లాడారు. విద్యను అందిస్తే కాశ్మీర్‌లో మార్పులు సాధ్యమేనంటూ కుండబద్దలు కొట్టారు. పుల్వామాలో దాడికి పాల్పడిన అతడికి ట్యూటర్లు, టీచర్లు సరైన విద్యను చెప్పలేదన్నారు. ‘సల్మాన్’ నటిస్తున్న నోట్‌బుక్ ఫిల్మ్ కాశ్మీర్ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ. మార్చి 29వ తేదీన చిత్రం రిలీజ్ కానుంది. సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందుతున్న ‘నోట్ బుక్’ సినిమాలో జహీరా ఇక్బాల్, ప్రనూతన్ భాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 
Read Also : కొడుకు కోసం వృద్ధ దంపతుల దీనస్థితి : పోలీసుల ఔదార్యం