కష్టపడు, పైకొస్తావ్.. వైరల్ అవుతున్న రిషి కపూర్ చివరి వీడియో..
రిషి కపూర్ చివరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

రిషి కపూర్ చివరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం ముంబైలోని చందన్‌వాడి స్మశానంలో ముగిశాయి. అంత్యక్రియలకు ఆయన కుటుంబ సభ్యులు, కొంతమంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా రిషి కపూర్ చేసిన రెండు ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా రిషి కపూర్ చివరి వీడియో ఇదేనంటూ ఆసుపత్రిలో ఆయన పాట పాడిన వీడియో ఒకటి బయటకొచ్చింది. ముంబైలోని రిలయెన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో బుధవారం రాత్రి రిషిని చేర్పించారు కుటుంబ సభ్యులు. ఆసుపత్రి సిబ్బంది ఒకరు రిషి కపూర్‌ను ఆప్యాయంగా పలకరించి, ఆయన నటించిన ‘దీవానా’ సినిమాలోని ‘‘తేరే దర్ద్ సే దిల్ ఆబాద్ రహా’’ పాట పాడి వినిపించగా.. రిషి అతణ్ణి మెచ్చుకున్నారు. పాట పూర్తయిన వెంటనే ఆ యువకుడికి తన ఆశీస్సులు అందించారు. ‘జీవితంలో కష్టపడి పైకి రావాలి. కష్టపడటమే మన వంతు, పేరు ప్రఖ్యాతులు అనేవి వాటంతటవే వస్తాయని’ అన్నారు. కాగా ఇది రిషి కపూర్ చివరి వీడియో అని కొందరు అంటుంటే, ఇంతకుముందు ఆయన ఆసుపత్రికి వచ్చినప్పుడు తీసిన వీడియో అని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.