Genelia Reaction To Riteish : ప్రీతిని ముద్దాడతావా.. భర్త రితేశ్‌ను జెనీలియా ఏం చేసిందంటే?
సినీనటి జెనీలియా డిసౌజాకు ఇదే పరిస్థితి ఎదురైంది. తాను చూస్తుండగానే తన భర్త రితేశ్ దేశ్ ముఖ్.. ఒక అవార్డు ఫంక్షన్‌లో నటి ప్రీతిజింటా చేతులపై ముద్దులు పెట్టాడు.

Ritiesh Deshmukh Kisses Preity Zinta's Hands, Jealous Genelia Gives Him A Punch (2)
Ritiesh Deshmukh kisses Preity Zinta hands : తన కళ్ల ఎదుటే మరో అమ్మాయితో భర్త చనువుగా ఉండటాన్ని ఏ భార్య భరించలేదు. వారిద్దరి తాట తీసేస్తుంది. భర్త పనిపడుతుంది. ఇప్పుడు సినీనటి జెనీలియా డిసౌజాకు ఇదే పరిస్థితి ఎదురైంది. తాను చూస్తుండగానే తన భర్త రితేశ్ దేశ్ ముఖ్.. ఒక అవార్డు ఫంక్షన్‌లో నటి ప్రీతిజింటా చేతులపై ముద్దులు పెట్టాడు. అది చూసిన జెనీలియాకు ఒళ్లు మండిది. పైకి నవ్వినట్టుగా కనిపించినప్పటికీ లోపల మాత్రం ఉడికిపోయింది. ఇంటికి రా నీ పనిచెబుతా అన్నట్టుగా భర్త రితేశ్ వైపు కోపంగా చూసింది.
ఇంటికి వచ్చాక తన భర్తపై జెనీలియా పిడిగుద్దుల వర్షం కురిపించింది. అది ఫన్నీగా.. భర్త వామ్మో వద్దు.. నాకు భయం వేస్తోంది.. ఇంకోసారి ఇలా చేయను అన్నట్టుగా భయపడిపోతున్నట్టు కిందిపడిపోయాడు. వాస్తవానికి ఈ వీడియో 2019లో ఐఫా అవార్డుల సమయంలోది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. రితీష్- ప్రీతి జింటాలను చూసి జెనీలియా కోపంగా చూస్తున్న ఎక్స్‌ప్రెషన్స్ వీడియోలో చాలా క్లియర్‌గా ఉంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లను ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram
సోషల్ మీడియాలో స్పూఫ్ వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. స్పందించిన జెనీలియా.. ప్రీతిని ముద్దాడిన తర్వాత ఇంట్లో ఏం జరిగిందో తెలుసా అంటూ మరో వీడియోను పోస్టు చేసింది. ఇంటికి రాగానే జెనీలియా..భర్త రితీష్‌ను పంచులు విసురుతున్నట్టు ఫన్నీ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోను రితేష్- ప్రీతి జింటాలకు ట్యాగ్ చేసింది. జెనీలియా-రితేష్ దేశ్‌ముఖ్ 2012లో ప్రేమ పెళ్లి అయింది. వీరికి రాయస్, రాహిల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.