బాలయ్యకు విలన్‌గా రోజా!

నటసింహ నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందబోయే సినిమాలో రోజా విలన్‌గా నటించనున్నట్టు సమాచారం..

  • Published By: sekhar ,Published On : November 28, 2019 / 09:05 AM IST
బాలయ్యకు విలన్‌గా రోజా!

Updated On : November 28, 2019 / 9:05 AM IST

నటసింహ నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందబోయే సినిమాలో రోజా విలన్‌గా నటించనున్నట్టు సమాచారం..

నటసింహ నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.. ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలను మించి ఈ సినిమా ఉండబోతుందని బోయపాటి ధీమాగా చెప్తున్నాడు. మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న NBK 106లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడని, కన్నడ బ్యూటీ రచితా రామ్ కథానాయిక అని, అనిరుధ్ మ్యూజిక్ అందించనున్నాడని రకరకాల వార్తలు వస్తున్నాయి కానీ మూవీ టీమ్ అధికారికంగా కన్ఫమ్ చేయలేదు.

తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య, బోయపాటి సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, ఎమ్మెల్యే రోజా నెగెటివ్ క్యారెక్టర్ చేయనున్నారనే వార్త బాగా వినిపిస్తోంది. బాలయ్య, రోజా కాంబినేషన్లో పలు సూపర్ హిట్ సినిమాలొచ్చాయి. ఎమ్మెల్యే పనులు, టీవీ షోలతో బిజీగా ఉండే రోజా అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తున్నారు.

బాలయ్య సినిమాలో పవర్‌ఫుల్ లేడీ విలన్‌ పాత్ర ఉందట. బోయపాటి తన కొత్త చిత్రంలో మహిళను పవర్‌ఫుల్ విలన్ పాత్రలో చూపించబోతున్నారని, ఆ పాత్ర కోసం చాలా మందిని పరిశీలించి చివరికి రోజాను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. సీనియర్ నటులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు అయిన బాలయ్య, రోజా కలిసి నటిస్తే క్రేజ్ మామూలుగా ఉండదు.
అయితే ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు. డిసెంబర్లో  బాలయ్య, బోయపాటి సినిమా షూటింగ్ ప్రారభం కానుంది. బాలయ్య 105వ సినిమా ‘రూలర్’ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది..