RRR : చైనాలో రిలీజ్‌తోనే రికార్డు సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’..

రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా భారతీయ చిత్రసీమని ప్రపంచస్థాయిలో నిలబెట్టింది. మూవీలోని యాక్షన్, ఎమోషన్.. ఫారిన్ ఆడియన్స్ ని సైతం కట్టిపడేసిని. రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్నా ఈ సినిమాకు ప్రజాధారణ మాత్రం పెరుగుతూనే వెళుతుంది. ఇప్పుడు చైనా బాక్స్ ఆఫీస్ మీద కన్నేసింది ఈ సినిమా. ఇటీవల ఈ మూవీ టికెట్స్ ని రిలీజ్ చేయగా..

RRR : చైనాలో రిలీజ్‌తోనే రికార్డు సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’..

RRR created a record with its release in China

Updated On : January 5, 2023 / 9:46 AM IST

RRR : రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా భారతీయ చిత్రసీమని ప్రపంచస్థాయిలో నిలబెట్టింది. బిఫోర్ ఇండిపెండెన్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో స్వతంత్ర సమరయోధులు అల్లుసీతారామరాజు, కొమరం భీం పాత్రల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించారు. మూవీలోని యాక్షన్, ఎమోషన్.. ఫారిన్ ఆడియన్స్ ని సైతం కట్టిపడేసిని. రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్నా ఈ సినిమాకు ప్రజాధారణ మాత్రం పెరుగుతూనే వెళుతుంది.

RRR : ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో ‘నాటు నాటు’ సాంగ్.. ఫస్ట్ ఇండియన్ సాంగ్..

ఇక ఈ సినిమాని పొరుగు దేశాలైన జపాన్, చైనాలో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇటీవలే జపాన్ లో ఈ మూవీని విడుదల చేయగా కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టించింది. దాదాపు 2 దశాబ్దాలుగా ఉన్న రజినీకాంత్ సినిమా రికార్డుని బ్రేక్ చేసి మొదటి స్థానం నిలిచింది. ఇప్పుడు చైనా బాక్స్ ఆఫీస్ మీద కన్నేసింది ఈ సినిమా. ఇటీవల ఈ మూవీ టికెట్స్ ని రిలీజ్ చేయగా.. కేవలం 98 సెకన్లలో మొత్తం టికెట్స్ అన్ని అమ్ముడుపోయిని.

ఇలా ఒక ఇండియన్ సినిమా టిక్కెట్లు చైనా బాక్స్ ఆఫీస్ వద్ద అమ్ముడుపోవడం రికార్డు అంటున్నారు ట్రేడ్ వర్గాలు. మునుముందు చైనాలో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. కాగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీం న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్ కి హాజరుకానున్నారు. ఈ పురస్కారాల్లో రాజమౌళి బెస్ట్ డైరెక్టర్ గా అవార్డుని అందుకోనున్నాడు.