RRR : ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో ‘నాటు నాటు’ సాంగ్.. ఫస్ట్ ఇండియన్ సాంగ్..

బుధవారం నాడు ఆస్కార్ కొన్ని విభాగాల్లో షార్ట్ లిస్ట్ ని ప్రకటించింది. ఇందులో ఒరిజినల్ సాంగ్ విభాగంలో RRR సినిమా నుంచి నాటు నాటు సాంగ్ షార్ట్ లిస్ట్ అయింది...............

RRR : ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో ‘నాటు నాటు’ సాంగ్.. ఫస్ట్ ఇండియన్ సాంగ్..

Naatu Naatu song shortlisted for Oscar

RRR :  రామ్ చరణ్, ఎన్టీఆర్ మెయిన్ లీడ్స్ లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ సినిమా RRR. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించి దాదాపు 1100 కోట్ల కలెక్షన్లని సాధించింది. ఇక ఈ సినిమాని టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అంతా పొగిడేస్తున్నారు. హాలీవుడ్ లో అయితే రాజమౌళి దర్శకత్వానికి అంతా ఫిదా అవుతున్నారు. ఇప్పటికే హాలీవుడ్ లో రాజమౌళి, RRR సినిమా వివిధ విభాగాల్లో అవార్డులు గెలుచుకోగా ఇప్పుడు ఆస్కార్ టార్గెట్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు రాజమౌళి.

దీంట్లో భాగంగానే రాజమౌళి ఇటీవల కొన్ని నెలలు అమెరికాలోనే ఉండి సినిమాని గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఆస్కార్ సందడి మొదలైంది. ఆస్కార్ కి వచ్చిన ఎంట్రీల నుంచి కొన్నిటిని షార్ట్ లిస్ట్ చేస్తున్నారు ఆస్కార్ టీం. బుధవారం నాడు ఆస్కార్ కొన్ని విభాగాల్లో షార్ట్ లిస్ట్ ని ప్రకటించింది. ఇందులో ఒరిజినల్ సాంగ్ విభాగంలో RRR సినిమా నుంచి నాటు నాటు సాంగ్ షార్ట్ లిస్ట్ అయింది. ఆస్కార్ కి ఇండియా సినిమా నుంచి షార్ట్ లిస్ట్ అయిన ఫస్ట్ సాంగ్ ఇదే కావడం విశేషం.

Narthan : కన్నడ డైరెక్టర్ కి ఓకే చెప్పిన విజయ్ దేవరకొండ??

దీంతో సినిమా యూనిట్ తో పాటు, అభిమానులు, తెలుగు ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆస్కార్ కి ఒక అడుగు దూరంలో నాటు నాటు సాంగ్ నిలిచింది. ఈ విభాగంలో మొత్తం 81 పాటలు పరిశీలనకు రాగా 15 సాంగ్స్ ని షార్ట్ లిస్ట్ చేశారు. ఈ 15లో జడ్జిలతో పాటు ఓటింగ్ ద్వారా కూడా ఎక్కువ ఓట్లు దేనికి వస్తే అదే ఈ సారి ఆస్కార్ ఒరిజినల్ సాంగ్ అవార్డు గెలుచుకుంటుంది. దీంతో ఎలాగైనా ఈ సారి నాటు నాటు సాంగ్ కి అవార్డు రావాలని కీరవాణి ఆస్కార్ అందుకోవాలని అంతా కోరుకుంటున్నారు. అలాగే మరిన్ని విభాగాల్లో నామినేషన్స్ ని త్వరలోనే తెలియచేయనున్నారు.