Narthan : కన్నడ డైరెక్టర్ కి ఓకే చెప్పిన విజయ్ దేవరకొండ??
విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తర్వాత సైలెంట్ అయిపోయిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి మీడియా ముందుకు ఎక్కువగా రావట్లేదు. తన నెక్స్ట్ సినిమాల అప్డేట్స్ కూడా ఏమి లేవు. సమంతతో కలిసి నటిస్తున్న ‘ఖుషీ’ సినిమా షూట్ కు సమంతకి................

vijay devarakonda planning a movie with kannada director Narthan
Narthan : విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తర్వాత సైలెంట్ అయిపోయిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి మీడియా ముందుకు ఎక్కువగా రావట్లేదు. తన నెక్స్ట్ సినిమాల అప్డేట్స్ కూడా ఏమి లేవు. సమంతతో కలిసి నటిస్తున్న ‘ఖుషీ’ సినిమా షూట్ కు సమంతకి ఆరోగ్యం బాగోకపోవడంతో బ్రేక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె తిరిగి వచ్చి షూట్ ను మొదలుపెట్టడానికి ఇంకాస్త టైమ్ పట్టేలానే ఉంది. ఈ గ్యాప్ లో విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమాని సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు.
జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరికి విజయ్ ఛాన్స్ ఇచ్చాడన్న న్యూస్ నిన్న మొన్నటి వరకూ బాగా స్ప్రెడ్ అయింది. అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. కన్నడ యంగ్ డైరెక్టర్ నర్తన్ విజయ్ కు ఒక అదిరిపోయే స్టోరీ నెరేట్ చేసినట్టు, దానికి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.
Sankranthi Movies : సంక్రాంతి బరిలో సినిమాలు.. ఇంకా షూటింగ్ లోనే..
కన్నడలో శివరాజ్ కుమార్ తో మఫ్టీ అనే సినిమా తీసిన నర్తన్ తో రామ్ చరణ్ మూవీ ఉంటుందని, యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తుందని గతంలో రూమర్స్ వినిపించాయి. అయితే నర్తన్ చెప్పిన స్టోరీ విజయ్ కి నచ్చడంతో దిల్ రాజు మరో కన్నడ నిర్మాణ సంస్థతో కలిసి నిర్మించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం నర్తన్ స్ర్కిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడట. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.