Sankranthi Movies : సంక్రాంతి బరిలో సినిమాలు.. ఇంకా షూటింగ్ లోనే..

2023 సంక్రాంతి రేస్ లో రెండు భారీ తెలుగు, రెండు తమిళ సినిమాలున్నాయి. తెలుగు విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ గా వస్తుంటే, నందమూరి నటసింహం బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’తో బరిలోకి దిగుతున్నారు. ఈ ఇద్దరి మాస్ హీరోల సినిమాలు...............

Sankranthi Movies : సంక్రాంతి బరిలో సినిమాలు.. ఇంకా షూటింగ్ లోనే..

Sankranthi Movies are still in shooting

Updated On : December 22, 2022 / 10:45 AM IST

Sankranthi Movies :  2023 సంక్రాంతి సీజన్ నాలుగు పెద్ద సినిమాలతో బాక్సాఫీస్ ను వేడెక్కించబోతోంది. తమిళ, తెలుగు సినిమాల కలయికతో ఈ సారి పెద్ద వార్ జరగబోతోంది. అయితే ఈ నాలుగు సినిమాలు ఇంకా షూటింగ్ దశలోనే ఉండడం ఆశ్చర్యం అనిపిస్తోంది. ఓ వైపు షూటింగ్ దశలో ఉన్నా టీజర్స్, సాంగ్స్ వదులుతూ ఫ్యాన్స్ ను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

2023 సంక్రాంతి రేస్ లో రెండు భారీ తెలుగు, రెండు తమిళ సినిమాలున్నాయి. తెలుగు విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ గా వస్తుంటే, నందమూరి నటసింహం బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’తో బరిలోకి దిగుతున్నారు. ఈ ఇద్దరి మాస్ హీరోల సినిమాలు ఒకేసారి రావడం ఫ్యాన్స్ లో పూనకాలు ఓ రేంజ్ లో లోడింగ్ అవుతున్నాయి.

ఇక్కడ విశేషం ఏంటంటే ఈ రెండు సినిమాలు నిర్మించింది మైత్రి మూవీ మేకర్సే. అయితే ఈ రేసులో చిరు, బాలయ్య సినిమాలకు పోటీగా తమిళ హీరో విజయ్ వారసుడు కూడా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాత అవడం వల్ల వారసుడికి తెలుగులో ఎక్కువ థియేటర్స్ కేటాయించడంతో మైత్రీ వారిలో టెన్షన్ స్టార్ట్ అయింది. దానికి తోడు ఈ రెండు సినిమాలు ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉండటం ఆశ్చర్యం. ఒకపక్క షూటింగ్ చేస్తూనే సంక్రాంతికి రిలీజ్ అని ప్రమోషన్ చేసేస్తున్నారు. మరి అనుకున్న టైంకి పూర్తి సినిమా పర్ఫెక్ట్ గా చూపిస్తారా లేదా అని కొంతమంది సందేహిస్తున్నారు.

Unstoppable Episode 6 Promo : హీరోయిన్ అవ్వాలంటే కొన్ని కాంప్రమైజ్‌లు తప్పవు.. అన్‌స్టాపబుల్‌లో బాలయ్య..

ఇక 2023 సంక్రాంతి బరిలోకి దిగుతున్న మరో రెండు సినిమాలు తమిళ డబ్బింగ్ వెర్షన్స్ అయిన విజయ్ ‘వారసుడు’, అజిత్ ‘తునివు’. తునివు తెలుగులో తెగింపు పేరుతో రిలీజ్ కాబోతోంది. అయితే ఈ రెండు సినిమాలు సైతం ఇంకా సెట్స్ పైనే ఉన్నాయి. జనవరి 12న విజయ్ వారసుడు రిలీజ్ కాబోతుండగా, అజిత్ ‘తునివు’ అదే రోజు కానీ, అంతకు ముందు రోజు కానీ రిలీజ్ కాబోతోందని టాక్ వినిపిస్తుంది. వినిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే ఉన్నాయి. వీటి రిలీజ్ కి ఇంకా 20 రోజులు మాత్రమే సమయం ఉంది. అయినా ఈ సినిమాలు ఇంకా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే ఉన్నాయి. చిత్ర యూనిట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను సంక్రాంతికి రిలీజ్ చేస్తామని కాన్ఫిడెంట్ గా ఉన్నా అభిమానులు మాత్రం ఇంకా సినిమా పూర్తి కాలేదా అని ఆందోళన పడుతున్నారు.