RRR Release Date : రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతికి ముందే..

ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు..

RRR Release Date : రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతికి ముందే..

Rrr

Updated On : October 2, 2021 / 6:30 PM IST

RRR Release Date: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం).. ఫ్యాన్స్, ఆడియన్స్, ఇండస్ట్రీ వర్గాల వారు ఎంతో ఆత్రుతగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఎదురు చూస్తున్నారు.

Naga Chaitanya – Samantha : కన్ఫామ్.. విడిపోయిన నాగ చైతన్య – సమంత

2022 జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చెయ్యనున్నట్లు ప్రకటించారు. #RRROnJan7th హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది..  కొమరం భీం పాత్ర‌లో జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతా రామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ నటించారు. అలియాభట్, ఒలీవియా మోరిస్‌ హీరోయిన్స్ కాగా అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

ChaySam : విడిపోతూ కూడా ఒకేమాట..

ఆలస్యానికి కారణాలు..
2018 నవంబర్2లో షూటింగ్ ప్రారంభమవగా.. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌తో షూటింగ్‌కి ఆలస్యమైంది.. 2021 ఆగస్టు 26 నాటికి షూటింగ్ పూర్తయ్యింది.. ఈనెలాఖరు కల్లా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అవుతంది.. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ పాన్ ఇండియా మూవీని డివివి దానయ్య నిర్మించారు.