RRR : రామ్‌చరణ్ ఇంట్లో సక్సెస్ సెలబ్రేషన్స్.. భారీ ఎత్తున తరలి రానున్న అభిమానులు

ఇక సినిమా భారీ విజయం సాధించడంతో అప్పుడే అభిమానులు. 'ఆర్ఆర్ఆర్' టీం సెలబ్రేషన్స్ ని మొదలు పెట్టారు. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ఇంట్లో ఇవాళ ఉదయం 10 గంటలకి 'ఆర్ఆర్ఆర్' సక్సెస్.........

RRR :  రామ్‌చరణ్ ఇంట్లో సక్సెస్ సెలబ్రేషన్స్.. భారీ ఎత్తున తరలి రానున్న అభిమానులు

Ram Charan

Updated On : March 25, 2022 / 7:28 AM IST

 

RRR :  రాజమౌళి దర్శకత్వంలో తారక్, చెర్రీలతో భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే పలు చోట్ల బెనిఫిట్ షోలు పడ్డాయి. ఓవర్సీస్ లో కూడా షోలు పడటంతో టాక్ బయటకి వచ్చేసింది. సినిమా చూసిన వారంతా అద్భుతం అంటూ పొగిడేస్తున్నారు. సినిమా అదిరిపోయింది అంటూ ప్రశంసిస్తున్నారు. ఫ్యాన్స్, ప్రేక్షకులు నుంచి సెలబ్రిటీల వరకు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు.

RRR : భ్రమరాంబ థియేటర్లో మెగా ఫ్యామిలీతో కలిసి బెనిఫిట్ షో చూసిన రాజమౌళి, చెర్రీ

ఇక సినిమా భారీ విజయం సాధించడంతో అప్పుడే అభిమానులు. ‘ఆర్ఆర్ఆర్’ టీం సెలబ్రేషన్స్ ని మొదలు పెట్టారు. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ఇంట్లో ఇవాళ ఉదయం 10 గంటలకి ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఈ సెలబ్రేషన్స్ రామ్ చరణ్ చేతుల మీదుగా జరగనున్నాయి. భారీ సంఖ్యలో రామ్ చరణ్ అభిమానులు అయన ఇంటి వద్దకు చేరుకోనున్నారు. రామ్ చరణ్ చేతుల మీదుగా కేక్ ని కట్ చేసి, పటాకులు పేల్చి ఈ సెలబ్రేషన్స్ ని నిర్వహించనున్నారు అభిమాన సంఘాలు.