#RRR మూవీ : ప్రధాన పాత్రల్లో అజయ్ దేవగన్, అలియా భట్

  • Published By: vamsi ,Published On : March 14, 2019 / 06:50 AM IST
#RRR మూవీ : ప్రధాన పాత్రల్లో అజయ్ దేవగన్, అలియా భట్

Updated On : March 14, 2019 / 6:50 AM IST

#RRR మూవీని అల్లూరి, కొమరం భీం లింక్ చేస్తూ తీస్తున్నట్లు స్పష్టం అయిపోయింది. ఇందులో అల్లూరిగా రాంచరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్నారు. వీరితోపాటు భారీ స్థాయిలో తారగణం ఉన్నట్లు తెలిపారు డైరెక్టర్ రాజమౌళి. సపోర్టింగ్ క్యారెక్టర్‌గా బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగన్ నటిస్తున్నట్లు తెలిపారు.
Read Also : #RRR మూవీ : రిలీజ్ డేట్ ఫిక్స్, బడ్జెట్ ఎంతో చెప్పేశారు

అజయ్ దేవగన్ ఇందులో ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే ముఖ్యమైన పాత్రను చేస్తున్నట్లు తెలిపారు. అలాగే రామ్‌చరణ్ పక్కన ఇందులో ఆలియా భట్ నటిస్తుందని, ఎన్టీఆర్ పక్కన జంటగా.. డైజీ అనే విదేశీ యువతి నటిస్తునట్లు చెప్పారు. సముద్రఖని కూడా ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నట్లు తెలిపారు. 
Read Also : #RRR మూవీ అద్భుతంగా ఉంటుంది : ఎన్టీఆర్

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR’పై ఉన్న అనుమానాలను తొలగించేందుకు ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సంధర్భంగా సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు రాజమౌళి. ఇది ఒక ఫిక్షన్ స్టోరీ అని ఇందులో నటించే ముఖ్యమైన వ్యక్తులు అని తెలిపారు. ఈ సినిమా కూడా బిగ్ ప్లాట్‌ఫాం మీదే ఉంటుందని, మేము చాలా రీసెర్చ్ చేసి సినిమాను తీస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 
Read Also : అల్లూరి సీతారామరాజు, కొమరం భీం కలిస్తే #RRR మూవీ