Sonudi Film Factory : మార్చ్ లో ఓపెనింగ్.. ఏప్రిల్ కి షూటింగ్ ఫినిష్.. చాలా ఫాస్ట్..
తాజాగా ఈ సినిమా నిర్మాత RU రెడ్డి మీడియాతో మాట్లాడారు.

RU Reddy Comments on his Sonudi Film Factory First Movie
Sonudi Film Factory : ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా సోనుది ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో ఇటీవల మార్చ్ లో కొత్త సినిమా ఓపెనింగ్ అయింది. ఈ సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్ గా పూర్తి చేసేసారు. తాజాగా ఈ సినిమా నిర్మాత RU రెడ్డి మీడియాతో మాట్లాడారు.
సోనుధి ఫిలిమ్ ఫ్యాక్టరీ అధినేత ఆర్.యు రెడ్డి మాట్లాడుతూ.. ఇదొక కొత్త రకమైన సినిమా. అనేక ఎమోషన్స్ ఉన్న కథ. ఆశిష్‌గాంధీ, మానస రాధాకృష్ణన్‌ల సహకారంతో అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసాం. డైరెక్టర్స్ కిరణ్ కిట్టి, లక్ష్మీ చైతన్యలు కొత్త వాళ్ళైనా చెప్పిన కథను చెప్పినట్లు తెరకెక్కించారు. ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఆ పాటను కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చేయనున్నారు.
త్వరలోనే సినిమా టైటిల్‌ను, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తాం. సినిమాను రెండు నెలల్లోనే రిలీజ్ చేస్తాం. మ్యూజిక్ డైరెక్టర్ గోపిసుందర్ అందించిన ఆరు పాటలు మా సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. మా బ్యానర్ నుండి మరి కొన్ని సినిమాలు ఈ ఏడాదిలోనే ప్రారంభిస్తాం అని తెలిపారు. మార్చ్, ఏప్రిల్ రెండు నెలల్లోనే షూటింగ్ మొత్తం పూర్తిచేసేశారని తెలిసి చాలా ఫాస్ట్ గా చేసేసారు అంటున్నారు టాలీవుడ్ జనాలు.