హిప్పీ షూటింగ్ కంప్లీట్ !

RX 100 చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ హీరోగా నటించే రెండవ చిత్రం హిప్పీ. తాజాగా ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమిళ దర్శకుడు టి ఎన్ కృష్ణ దర్శకత్వంలో వీ క్రియేషన్స్ పతాకం పై కలైపులి థాను నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ సినిమా ఫై అంచనాలను పెంచింది. ఈ చిత్రం లో దిగణన సూర్యవంన్షి , జజ్బా సింగ్ కథానాయికలుగా నటిస్తుండగా ఓ స్పెషల్ సాంగ్ లో శ్రద్దా దాస్ కనిపించనుంది. ఈ చిత్రానికి నివాస్ ప్రసన్న సంగీతం అందిస్తున్నాడు. మే లో ఈ చిత్రం విడుదల కానుంది.
కార్తికేయ మాట్లాడుతూ.. ” RX 100 సినిమా తర్వాత కథలు విన్నాను. నా గత చిత్రానికి భిన్నంగా ఉండే సినిమా చేయాలనుకునే సమయంలో దర్శకుడు టీఎన్ కృష్ణ చెప్పిన కథ బాగా నచ్చింది. టాప్ ప్రొడ్యూసర్ కలైపులి థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని తెలిసి మరింత ఉత్సాహం కలిగింది. ‘కబాలి’ లాంటి పెద్ద సినిమా రూపొందిన బేనర్లో నటించడం నా అదృష్టం. ఈ సినిమా నా కెరీర్ టర్నింగ్ పాయింట్ అవుతుందనే నమ్మకం ఉంది అన్నారు.