భీమవరం – ప్రభాస్ సాహో మయం

ప్రభాస్ సొంత ప్రాంతమైన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సాహో రిలీజ్ సందర్భంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు డార్లింగ్ ఫ్యాన్స్..

  • Published By: sekhar ,Published On : August 29, 2019 / 10:53 AM IST
భీమవరం – ప్రభాస్ సాహో మయం

Updated On : May 28, 2020 / 3:44 PM IST

ప్రభాస్ సొంత ప్రాంతమైన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సాహో రిలీజ్ సందర్భంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు డార్లింగ్ ఫ్యాన్స్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ నటించిన  మోస్ట్ అవైటెడ్ మూవీ.. సాహో.. మరికొద్ది గంటల్లో సిల్వర్ స్క్రీన్స్‌పై సందడి చెయ్యనుంది. ఇప్పటికే అన్నిచోట్లా సినిమాను భారీగా ప్రదర్శించడానికి ఏర్పాట్లు జరిగిపోయాయి. ఆగస్టు 29 అర్థరాత్రి నుండే చాలా చోట్ల బెనిఫిట్ షోలు ప్లాన్ చేశారు. మరికొన్ని చోట్ల తెల్లవారుజాము షోలు వెయ్యనున్నారు. సాహో టికెట్లకోసం భారీ పోటీ నెలకొంది.

సాహో మానియా అంతటా ఒకలా ఉంటే.. ప్రభాస్ సొంత ప్రాంతమైన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పరిస్థితి మరోలా ఉంది. భీమవరం అంతా సాహో మయమైపోయింది. థియేటర్లను భారీ ఫ్లెక్సీలతో నింపేశారు. డార్లింగ్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీ చూసి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

Read Also : మెగా పవర్ స్టార్ లాంచ్ చేసిన మెగా స్క్రీన్ మల్టీప్లెక్స్‌..

స్థానిక SRKR కాలేజ్ దగ్గర ప్రభాస్ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి, ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మెయ్యాలి డ్యూడ్’ అంటున్నారు ఫ్యాన్స్. సిటీలోనూ వీధుల్లోనూ ఏర్పాటే చేసిన సాహో ఫ్లెక్సీలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. అభిమానుల ఎదురుచూపులకు మరి కాసేపట్లో తెరపడనుంది.