మేకింగ్ : సాహోలో కార్నివాల్ సాంగ్

సాహో.. ఈ టైటిల్ వింటేనే చాలు ప్రభాస్ ఫ్యాన్స్ ఫిదా అవుతారు. భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇప్పటికే దేశవ్యాప్తంగా హైప్ క్రియేట్ అవుతుంది. టీజర్ తోనే రికార్డ్స్ బద్దలు కొట్టిన సాహో మూవీలో మరో హైలెట్ సాంగ్ మేకింగ్ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. కార్నివాల్ సెట్టింగ్ లో ప్రభాస్, ఇతర స్టార్స్ తో పాట చిత్రీకరణ జరుగుతుంది. దీని కోసం కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారు. మూవీకే హైలెట్ గా ఈ సాంగ్ ఉండనున్నట్లు సమాచారం.
హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో కార్నివాల్ సాంగ్ మేకింగ్.. వారం రోజులుగా తీస్తున్నారు. ఈ సాంగ్ కంప్లీట్ తో.. 60శాతం షూటింగ్ పూర్తవుతుందని యూనిట్ చెబుతోంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది. 2019, ఆగస్ట్ 15వ తేదీన వాల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ఉంటుందని గట్టిగా చెబుతున్నారు. అబుదాబిలో 60 రోజుల యాక్షన్ సీన్స్ తర్వాత అతిభారీ కార్నివాల్ సెట్ తో షూటింగ్ జరుపుకోవటం ఇదే అంటున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తోపాటు హీరోయిన్ శ్రద్ధాకపూర్, నీల్ నితిన్ ముఖేష్ కూడా ఈ పాటలో కనిపించబోతున్నారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ బడ్జెట్ 300 కోట్లు. అందుకు తగ్గట్టుగానే రిచ్ గా ఉండనుంది. ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా తీర్చిదిద్దటానికి డైరక్టర్ బాగా కష్టపడుతున్నాడు.
జాకీ షరీఫ్, మండిరి బేడీ, చంకి పాండే, మాష్ష్ మంజ్రేకర్, అరుణ్ విజయ్, మురళీ శర్మ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అబుదాబి యాక్షన్ సీన్స్ కోసం 37 కార్లు, 5 భారీ ట్రక్కులకు నుజ్జునుజ్జుచేశారు. కార్నివాల్ సాంగ్ ను ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్లు లారెంట్, లారి నికోలస్ బూర్జవా ఆధ్వర్యంలో జరుగుతుంది.