Sagileti Katha Trailer : ‘సగిలేటి కథ’ ట్రైలర్.. అదిరిపోయింది.. రాయలసీమ కోడి

హీరో నవదీప్ సమర్పణలో రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంట గా నటిస్తున్న సినిమా 'సగిలేటి కథ(Sagileti Katha). రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్ సుద్మూన్ ద‌ర్శ‌కుడు.

Sagileti Katha Trailer : ‘సగిలేటి కథ’ ట్రైలర్.. అదిరిపోయింది.. రాయలసీమ కోడి

Sagileti Katha Trailer

Updated On : August 1, 2023 / 4:17 PM IST

Sagileti Katha : హీరో నవదీప్ సమర్పణలో రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంట గా నటిస్తున్న సినిమా ‘సగిలేటి కథ(Sagileti Katha). రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్ సుద్మూన్ ద‌ర్శ‌కుడు. అంతేకాదు.. రచన, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ కూడా ఆయ‌నే. అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం స‌మ‌ర్ప‌కుడు హీరో నవదీప్ సమక్షంలో జరిగింది. హీరో సోహెల్, ప్రొడ్యూజర్ జి సుమంత్ నాయుడు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ద‌ర్శ‌కుడు ‘రామ్ గోపాల్ వర్మ’ వీడియో క్లిప్ ద్వారా చిత్ర‌బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. కోడి కేంద్రంగా సినిమా ఉంటుంద‌ని, అయితే.. క‌థ అంత‌కు మించిన‌ద‌ని చిత్ర‌బృందం తెలియ‌జేసింది. చిత్రంలో ప‌లు స‌ర్‌ప్రైజ్‌లు ఉంటాయ‌న్నారు.

OMG 2 : దేవుడి సినిమాకి ‘A’ సర్టిఫికెట్ రావడమా..? ‘ఓ మై గాడ్’ రిలీజ్‌కి ముందే 27 సన్నివేశాలు..!

గంగాల‌మ్మ పుణ్యమా అని కొత్త గ‌జ్జెలు తాకట్టు పెడితే గానీ నీకు కోడి కూర తినే అదృష్టం రాలేదు అనే డైలాగుతో ట్రైల‌ర్ ప్రారంభ‌మవుతుంది. ఏదో కార‌ణం వ‌ల్ల జాత‌ర ఆగిపోతుంది. జాత‌ర జ‌ర‌గ‌పోతే ఊరు అల్ల‌క‌ల్లోలం అవుతుంద‌ని స్వామీజీ చెబుతాడు. జాత‌ర ఏ కార‌ణం వ‌ల్ల ఆగిపోయింది..? మ‌ళ్లీ జాత‌ర జ‌రిగిందా..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. రాయలసీమలో పెన్నానదికి ఉపనది అయిన సగిలేరు తీరంలో ఓ జాతర నేపథ్యంలో రుచికరమైన చికెన్ తినడానికి తహతహలాడే ఒక పాత్ర చుట్టూ తిరిగే కథ అని ట్రైలర్ ను బ‌ట్టి అర్థం అవుతోంది.

ఇక ఈ సినిమా సెప్టెంబర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Samajavaragamana : ఓటీటీలోనూ సామజవరగమన రికార్డులు.. 72 గంట‌ల్లో 200 మిలియ‌న్..