Sai Pallavi : ఆ స్టార్ హీరో వారసుడి మూవీతో సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ..

బాలీవుడ్ కి సాయి పల్లవి. ఒక స్టార్ హీరో కొడుకు నటిస్తున్న మూవీతో..

Sai Pallavi : ఆ స్టార్ హీరో వారసుడి మూవీతో సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ..

Sai Pallavi bollywood entry with Aamir Khan son Junaid Khan

Updated On : September 15, 2023 / 7:51 AM IST

Sai Pallavi : లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి చాలా సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ వస్తుంది. ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా కథ నచ్చితేనే ఒక చెబుతుంది. ఈక్రమంలోనే ఈ అమ్మడు చాలా తక్కువ సినిమాల్లో మాత్రమే కనిపించింది. ఇక ఈ ఎంపిక విధానమే తనకి మరింత ఎక్కువ అభిమానాన్ని సంపాదించి పెట్టింది. కాగా సాయి పల్లవి ఇప్పటివరకు సౌత్ లోని పలు బాషలోనే సినిమాలు చేస్తూ వచ్చింది. తాజాగా ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది. అది కూడా ఒక స్టార్ హీరో వారసుడు సినిమాతో డెబ్యూట్ చేయబోతుంది.

Baby Movie : బేబీ సినిమాపై సీపీ ఆగ్రహం.. స్పదించిన దర్శకుడు సాయి రాజేష్..

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్‌ ఖాన్‌ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఆ మూవీ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే ఆ సినిమా పూర్తికాకముందే రెండో సినిమాని పట్టాలు ఎక్కించేస్తున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ గానే సాయి పల్లవిని ఎంపిక చేశారట. సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లవ్ స్టోరీగా తెరకెక్కబోతుంది. ఈ మూవీ కోసం సాయి పల్లవి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సమాచారం. త్వరలోనే సాయి పల్లవిని హీరోయిన్ గా అధికారికంగా ప్రకటించనున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Ramanna Youth : రామన్న యూత్.. లీడర్స్ వెనక తిరిగే ప్రతి యూత్ చూడాల్సిన సినిమా..

కాగా సాయి పల్లవి ప్రస్తుతం శివ కార్తికేయన్ మూవీలో నటిస్తుంది.ఈ మూవీ దేశభక్తి నేపథ్యంతో తెరకెక్కుతుంది. ఇటీవలే కాశ్మీర్ లో ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్నారు. రాజ్‌కుమార్‌ పెరియసామి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. లోక‌నాయ‌కుడు కమల్‌హాసన్‌ (Kamal Haasan) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం గమనార్హం. జి.వి ప్రకాష్ సంగీతాన్ని అందిస్తుండ‌గా, సిహెచ్.సాయి సినిమాటోగ్రఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.