Sai Pallavi : కమల్ హాసన్ నిర్మాణంలో సాయి పల్లవి కొత్త సినిమా.. శివ కార్తికేయన్‌ హీరో!

సాయి పల్లవి యాక్టింగ్ కి గుడ్ బై చెప్పేసింది అనే వార్తలకు చెక్ పెడుతూ.. కమల్ హాసన్ నిర్మాణంలో శివ కార్తికేయన్ తో ఒక సినిమా ప్రకటించింది.

Sai Pallavi : కమల్ హాసన్ నిర్మాణంలో సాయి పల్లవి కొత్త సినిమా.. శివ కార్తికేయన్‌ హీరో!

Sai Pallavi starts new movie with Sivakarthikeyan and Kamal Haasan

Updated On : May 5, 2023 / 6:04 PM IST

Sai Pallavi : లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ని స్పదించుకున్న సాయి పల్లవి.. గత ఏడాది విరాటపర్వం, గార్గి సినిమాలతో ఆడియన్స్ ని పలకరించింది. ఆ తరువాత మరో సినిమా ప్రకటించ లేదు. దీంతో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుంది అంటూ కూడా వార్తలు వినిపించాయి. దీంతో ఆమె అభిమానులు చాలా బాధ పడ్డారు. తాజాగా వారిని సంతోష పరిచేలా తన కొత్త సినిమాని లాంచ్ చేసింది. తమిళ హీరో శివ కార్తికేయన్ (Sivakarthikeyan) 21వ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి చేస్తుంది. ఈ మూవీ పూజా కార్యక్రమాలు నేడు ఘనంగా జరిగాయి.

Custody Trailer : న్యాయం పక్కన నిలబడి చూడు.. నాగచైతన్య కస్టడీ ట్రైలర్ వచ్చేసింది..

ఇక ఈ సినిమాని ఉలగనయగన్ కమల్ హాసన్ (Kamal Haasan) నిర్మిస్తుండడం విశేషం. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకం పై ఈ సినిమాని కమల్ హాసన్ నిర్మించబోతున్నాడు. సోనీ పిక్చర్స్ ఫిలింస్ ఇండియా సంస్థ కూడా ఈ నిర్మాణంలో భాగం కానుంది. RKFI కార్యాలయంలో జరిగిన ఈ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ కి కమల్ హాసన్, శివ కార్తికేయన్, సాయి పల్లవి హాజరయ్యి సందడి చేశారు. రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. జివి ప్రకాష్‌ సంగీతం అందించనున్నాడు.

Sailesh Kolanu : మొన్న పవన్ అభిమానికి బిర్యానీ.. నేడు శైలేష్ కొలనుకు అభిమాని పవన్ బ్రేక్‌ఫాస్ట్‌..

కమల్ హాసన్ ఈ సినిమాని నిర్మిస్తుండడం, శివ కార్తికేయన్ అండ్ సాయి పల్లవి ఫ్రెష్ కాంబినేషన్ కావడంతో ఆడియన్స్ లో క్యూరియాసిటీని కలగజేస్తుంది. 2024 లో ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది. త్వరలోనే ఈ మూవీ పట్టాలు ఎక్కనుంది. ఎట్టకేలకు సాయి పల్లవి సినిమా ప్రకటించడంతో ఆమె అభిమానులు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అయితే ఈ సినిమాని తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తారా? లేదా? చూడాలి.