Sai Dharam Tej : నా పేరు మార్చుకున్నాను.. మా అమ్మ కోసం.. ఇక నుంచి నా పేరు ఇదే..
తాజాగా సత్య షార్ట్ ఫిలింకి సంబంధించిన ప్రెస్ మీట్ లో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ..

Sai Sharam Tej change his Name Emotional Speech in Satya Short Film Press Meet
Sai Dharam Tej : మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ 2021 లో ఓ పెద్ద బైక్ యాక్సిడెంట్ కి గురయి రెండేళ్లు పట్టింది కోలుకోడానికి. ఎన్నో సర్జరీలు, ఎంతో కష్టపడి తేజ్ మాములు మనిషి అయ్యాడు. ఆ సమయంలో సినిమాలకు గ్యాప్ ఇచ్చి విరూపాక్ష సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ తో వచ్చి భారీ హిట్ కొట్టాడు. ఆ తర్వాత పవన్ తో కలిసి బ్రో సినిమాతో మెప్పించాడు.
తేజ్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నా హెల్త్ మీద మరింత ఫోకస్ చేయడానికి కొన్ని నెలలు సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. అయితే సాయి ధరమ్ తేజ్, స్వాతి కలిసి గతంలో నవీన్ దర్శకత్వంలో సత్య అనే ఓ షార్ట్ ఫిలిం చేశారు. ఆల్రెడీ సత్య షార్ట్ ఫిలిం నుంచి సాంగ్ రిలీజ్ చేసి మెప్పించారు. తాజాగా ఉమెన్స్ డే సందర్భంగా ఈ షార్ట్ ఫిలిమ్ కొంతమందికి ప్రీమియర్ వేసి, ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
Also Read : Ram Charan : ఉమెన్స్ డే రోజు అమ్మ కోసం స్పెషల్ వంట చేసిన చరణ్.. ఏమేమి వండాడో తెలుసా? పక్కన ఉపాసన ఏమో..
ఈ ప్రెస్ మీట్ లో సాయి ధరమ్ తేజ్ షార్ట్ ఫిలిమ్ గురించి మాట్లాడిన అనంతరం.. నా లైఫ్ లో ముగ్గురు సత్యలు ఉన్నారు. మా అమ్మ, పిన్ని, అంజనాదేవి. వాళ్ళు నన్ను దగ్గరికి తీసుకొని పెంచారు. వాళ్ళని నేను హ్యాపీగా ఉంచడం తప్ప ఇంకేమి చేయలేను. నేను ఎదిగితేనే వాళ్ళకి హ్యాపీ. ఎప్పట్నుంచో మా అమ్మ పేరు మీద ప్రొడక్షన్ హౌస్ మొదలుపెడదాం అనుకున్నాను. అది ఈ సత్యతో మొదలైంది. మా అమ్మ పేరు మీద విజయ దుర్గ ప్రొడక్షన్స్ మొదలుపెట్టాను. అలాగే ఇవాళ్టి నుంచి నా పేరులో మా అమ్మ గారి పేరు యాడ్ చేసాను. మా నాన్న గారి పేరు ఇంటిపేరుతో ఎలాగూ ఉంటుంది. మా అమ్మ నా తోటి ఉండాలి. అందుకే మా అమ్మ పేరు యాడ్ చేసుకొని నా పేరుని సాయి దుర్గ తేజ్ గా మార్చుకున్నాను అని తెలిపారు. దీంతో సాయి ధరమ్ తేజ్ స్పీచ్ వైరల్ గా మారింది.
గతంలో యాక్సిడెంట్ అయినప్పుడు తను కోలుకోడానికి, తనకి మాటలు రావడానికి వాళ్ళ అమ్మ దగ్గరుండి తనని చిన్నపిల్లాడిలా చేసుకుందని, అన్ని సేవలు చేసిందని ఓ ఇంటర్వ్యూలో చెప్తూ ఎమోషనల్ అయ్యాడు తేజ్. ఇప్పుడు ఇలా వాళ్ళ అమ్మ పేరుని జత చేర్చుకోవడంతో అంతా సంతోషం వ్యక్తపరుస్తున్నారు.