తమన్‌కు సుప్రీం హీరో సర్‌ప్రైజ్ గిఫ్ట్

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ను సర్‌ప్రైజ్ గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేశాడు.. తేజు ఇచ్చిన గిఫ్ట్ గురించి తమన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు..

  • Published By: sekhar ,Published On : November 26, 2019 / 05:30 AM IST
తమన్‌కు సుప్రీం హీరో సర్‌ప్రైజ్ గిఫ్ట్

Updated On : November 26, 2019 / 5:30 AM IST

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ను సర్‌ప్రైజ్ గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేశాడు.. తేజు ఇచ్చిన గిఫ్ట్ గురించి తమన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు..

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘ప్రతి రోజు పండగే’’. ఇప్పటివరకు విడుదల చేసిన రెండు పాటలు కూడా సూపర్బ్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఈ సాంగ్స్‌ని అద్భుతంగా కంపోజ్ చేశాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. తమన్, సాయి తేజ్ ఫ్రెండ్ షిప్ గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. సంగీత దర్శకుడిగా తేజ్‌తో ఇప్పటికి నాలుగు సినిమాలకు పనిచేశారు తమన్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఐదో సినిమా ‘ప్రతిరోజూ పండగే’. 

ఎంతో ఇష్టమైన తన ఫ్రెండ్ తమన్‌ను ఒక సర్‌ప్రైజ్ గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేశాడు తేజ్. తమన్ మ్యూజిక్ టేస్ట్‌కి తగ్గట్టుగా ‘పెర్ల్ మాలెట్‌స్టేషన్’ అనే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు.. వీరిద్దరి కాంబినేషన్లో పలు సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. తనకు తేజు ఇచ్చిన గిఫ్ట్ గురించి తమన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

‘‘నా ఫ్రెండ్ సాయి ధరమ్ తేజ్ ఈ లవ్‌లీ ‘పెర్ల్ మాలెట్ వర్క్‌స్టేషన్‌’ను నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇది నాకు చాలా పెద్ద సర్‌ప్రైజ్. ప్రతిరోజూ పండగే అన్న మాటను ఈయన నిజం చేసారు. సాయి చాలా మంచి వ్యక్తి, ఆయన సక్సెస్ కోసం ప్రార్ధిస్తున్నాను’ అంటూ ట్విట్టర్‌లో ఫొటో పోస్ట్ చేసాడు తమన్.