Salaar : సలార్ పైరసీ కనిపిస్తే ఇలా చేయండి రెబల్స్.. నిర్మాతలు రిక్వెస్ట్..
సలార్ కి సంబంధించిన పైరసీ ఎక్కడైనా కనిపిస్తే ఇలా చేయండి రెబల్ అభిమానులకు నిర్మాతలు రిక్వెస్ట్.

Salaar producers request to Prabhas fans to control piracy content
Salaar : రెబల్ అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సలార్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం మొదటి భాగం.. నేడు పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఆల్రెడీ థియేటర్స్ వద్ద సినిమా సందడి మొదలైపోయింది. ప్రభాస్ నుంచి ఒక మాస్ బొమ్మ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు.. అరిరిపోయే మాస్ ఎంటర్టైనర్ దొరికినట్లు చెబుతున్నారు. దీంతో థియేటర్స్ వద్ద రెబల్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు.
కాగా ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకున్న ఈ చిత్రం పై నిర్మాతలు చాలా జాగ్రత్తలు జరుగుతున్నాయి. భారీ హైప్ ఉంది కాబట్టి పైరసీ అయ్యే ఛాన్స్ ఉండడంతో నిర్మాతలు అభిమానులను ఒక రిక్వెస్ట్ కోరుతున్నారు. సలార్ కి సంబంధించిన పైరసీ ఎక్కడైనా కనిపిస్తే తమ యాంటీ పైరసీ టీంకి తెలియజేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎక్స్ (X) లో సినిమాకి సంబంధించిన ముఖ్యమైన సీన్స్ ని ఎవరైనా పోస్ట్ చేసినా తమకి తెలియజేయండి అని చెబుతున్నారు. ఎక్స్ (X) లో మీరు పైరసీ కంటెంట్ చూస్తే.. X@BLOCKXTECHS అంటూ రీ ట్వీట్ చేయాలి.
Also read : Salaar Twitter Review : సలార్ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది..
ఒకవేళ ఏదైనా పైరసీ సైట్స్ లో సలార్ మూవీ లేదా సినిమాకి సంబంధించిన ఏ విషయం కనిపించినా.. REPORT@BLOCKXTECH.COM అనే మెయిల్ కి మెసేజ్ చేయాలని నిర్మాతలు కోరుతున్నారు. రెబల్ ఫ్యాన్స్ మరి మీరు ఎక్కడైనా పైరసీ కంటెంట్ కనిపిస్తే.. వాటిని తొలిగించేలా ఈ రెండు విషయాలని ఫాలో అయ్యిపోండి. అలాగే మీరు కూడా సినిమాకి సంబంధించిన సీన్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేయకుండా ఉండండి.
View this post on Instagram