సల్మాన్ ఖాన్, మురుగదాస్ సినిమా టైటిల్ వచ్చేసింది.. ఏంటో తెలుసా?

బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ ఖాన్, సౌత్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్ వచ్చేసింది.

సల్మాన్ ఖాన్, మురుగదాస్ సినిమా టైటిల్ వచ్చేసింది.. ఏంటో తెలుసా?

Updated On : April 11, 2024 / 11:59 AM IST

Salman Khan Sikandar Movie: సౌత్‌లో సూపర్ హిట్ సినిమాలు తీసిన‌ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ గత కొంతకాలంగా వెనుకబడ్డారు. వరుస ఫ్లాపులతో డీలా పడిన ఆయన తాజాగా బంఫ‌ర్ ఆఫ‌ర్ ద‌క్కించుకున్నారు. అగ్రహీరోతో సినిమా చాన్స్ దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని హిట్ కొట్టాలని కసితో ఉన్నారు డైరెక్టర్ మురుగదాస్.

బాలీవుడ్ టాప్ స్టార్ సల్మాన్ ఖాన్, సౌత్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. రంజాన్ సందర్భంగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేశారు మూవీ మేకర్స్. ఈ సినిమాకు సికందర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సాజిద్ నదివాలా నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్ పండుగకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఇంకా ఎవరెవరు నటిస్తున్నారు, టెక్నికల్ టీమ్ వివరాలు ఇంకా వెల్లడించలేదు.

సికిందర్ టైటిల్‌ను ట్విటర్‌ ద్వారా సల్మాన్ ఖాన్ ప్రకటించారు. ”ఈ సంవత్సరం ఈద్ పండుగకు ‘బడే మియాన్ చోటే మియాన్’ ఔర్ ‘మైదాన్’ సినిమాలు చూడండి. వచ్చే ఏడాది నా సినిమా సికందర్‌తో కలుద్దాం. మీ అందరికీ ఈద్ ముబారక్!” అంటూ పోస్ట్ పెట్టారు.

 

Also Read: ప్ర‌భుదేవా పాట‌కు రాజ‌మౌళి దంప‌తుల స్టెప్పులు.. రిహార్స‌ల్స్ వీడియో చూశారా?