Salman Khan – Katrina Kaif: వైరల్‌గా మారిన సల్మాన్ – కత్రినాల పెళ్లి వీడియో

ఇప్పటి వరకూ కత్రినా - కౌశల్ ఎటువంటి అధికారిక స్టేట్మెంట్ రిలీజ్ కాకపోయినప్పటికీ.. అభిమానులు కన్ఫామ్ చేసేశారు. మరో వైపు సల్మాన్ ఖాన్ -కత్రినా కైఫ్‌ల పెళ్లి వీడియో ఒకటి వైరల్ అయింది.

Salman Khan – Katrina Kaif: వైరల్‌గా మారిన సల్మాన్ – కత్రినాల పెళ్లి వీడియో

Salman Katrina

Updated On : November 29, 2021 / 11:48 AM IST

Salman Khan – Katrina Kaif: బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ లు రాజస్థాన్ లో వివాహ బంధంతో ఒకటి కానున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో ఫుల్ బిజీ అయిపోయారు కూడా. ఇప్పటి వరకూ ఎటువంటి అధికారిక స్టేట్మెంట్ రిలీజ్ కాకపోయినప్పటికీ.. అభిమానులు కన్ఫామ్ చేసేశారు.

ఇదిలా ఉంటే, మరో వైపు సల్మాన్ ఖాన్ -కత్రినా కైఫ్ ల పెళ్లి వీడియో ఒకటి వైరల్ అయింది. అధికారికంగా కౌశల్ తో పెళ్లికి సిద్ధమవుతున్న కత్రినా.. భరత్ సినిమాలో సల్మాన్ తో పెళ్లి చేసుకున్నట్లు ఉండే సీన్ మాత్రమే వైరల్ చేస్తున్నారు.

ఆ వీడియోలో పెద్ద వయస్కుడిలా ఉండే సల్మాన్ తో.. సమ వయస్సున్న జోడీగా కత్రినా కనిపిస్తుంది. ఇద్దరూ దండలు మార్చుకుని పెళ్లి వేడుక జరుపుకుంటారు. ఈ వీడియోను షేర్ చేస్తూ దానిపై కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

……………………………………… : పార్లమెంట్ సెషన్ స్టార్ట్..అప్పుడే వాయిదాలు, ప్రతి ప్రశ్నకు జవాబు చెబుతాం – ప్రధాని

నిజానికి కత్రినా.. సల్మాన్ ల బంధం సినిమా వరకూ కాదు. బయట కూడా చాలా క్లోజ్ గా ఉండేవారని ఒక గాసిప్ ఉంది. 2003లో ఆమె కెరీర్ మొదలైనప్పటి నుంచి 2010వరకూ సల్మాన్ తో డేటింగ్ లో ఉందట. వారి రిలేషన్ గురించి ఇద్దరూ చాలా సార్లు చెప్పకనే చెప్పారు కూడా. కాకపోతే వారి మధ్య బంధం చెడిపోయి రణబీర్ కపూర్ తో జత కట్టింది కత్రినా. కట్ చేస్తే.. విక్కీ కౌశల్ తో మూడు ముళ్ల బంధానికి సిద్ధమైంది ఈ లండన్ బ్యూటీ.

డిసెంబర్ 7, 8తేదీల్లో సంగీత్, మెహందీ కార్యక్రమాల తర్వాత 9వ తేదీ పెళ్లి వేడుకతో ఒకటి కానున్నారు.