Salman Khan: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న సల్మాన్ ఖాన్

ఒక్కో మొక్క ఒక్కో మనిషికి సరిపడా ఆక్సిజన్‌ను అందిస్తుందన్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్....

Salman Khan: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న సల్మాన్ ఖాన్

Salman Khan Participates In Green India Challenge

Updated On : June 22, 2022 / 5:25 PM IST

Salman Khan: ఒక్కో మొక్క ఒక్కో మనిషికి సరిపడా ఆక్సిజన్‌ను అందిస్తుందన్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. తన తాజా సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌కి వచ్చిన సల్మాన్ ఖాన్, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5.0”లో పాల్గొన్నారు.

Salman Khan : బట్టలు కొనుక్కోడానికి కూడా డబ్బులు ఉండేవి కావు.. ఆయన నాకు దేవుడి లాంటి వాడు..

అనంతరం సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడాన్ని ప్రతీ ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఏదో మొక్కను నాటామా.. పని అయిపోయిందా అని కాకుండా ఆ మొక్క పెరిగే వరకు శ్రద్ధ తీసుకోవాలని కోరారు. అకాల వర్షాలు, వరదలు, విపత్తులతో మన కళ్ల ముందే దేశంలో అనేక మంది ప్రజలు చనిపోతుండటం బాధాకరమన్నారు. వాతావరణ మార్పులతో జరిగే అనర్థాలు ఆగాలంటే మనం చెట్లు నాటడం ఒక్కటే మార్గమని.. ఆ పనికి జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ద్వారా బాటలు వేసారని.. దాన్ని మనం కొనసాగిస్తే మన నేలను, భవిష్యత్ తరాలను కాపాడుకోవచ్చని తెలిపారు. నా అభిమానులంతా విధిగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొని విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Salman Khan: సల్మాన్‌ను చంపేందుకు రెక్కీ… వెల్లడించిన గ్యాంగ్‌స్టర్

అనంతరం రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. పెద్ద మనసుతో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా మొక్కలు నాటుదామని చెప్పగానే వచ్చి మొక్కలు నాటిన సల్మాన్ ఖాన్ గారికి కృతజ్ఞతలు. మీరు మొక్కలు నాటడం వల్ల కోట్ల మంది అభిమానులకు స్పూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సినిమా బృందంతో పాటు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కో-ఫౌండర్ రాఘవ, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.