Salman Khan : తగ్గని హత్య బెదిరింపులు.. బులెట్ ప్రూఫ్ కారు కొనుగోలు చేసిన సల్మాన్..
సల్మాన్ ఖాన్ కి (Salman Khan) పోలీసులు Y+ కేటగిరీ భద్రతను కలిపించిన హత్య బెదిరింపులు మాత్రం తగ్గడం లేదు. దీంతో సల్మాన్ హై-ఎండ్ బులెట్ ప్రూఫ్ కారుని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.

Salman Khan Purchase SUV bullet proof car due to threats
Salman Khan : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కి (Salman Khan) కొంత కాలంగా హత్య బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఇక ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) అనే గ్యాంగ్‌స్టర్ ఏకంగా ఒక ఇంటర్వ్యూ ద్వారా సల్మాన్ కి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా బెదిరింపు ఇమెయిల్ కూడా పంపించాడు. దీంతో ముంబై పోలీసులు సల్మాన్‌కు Y+ కేటగిరీ భద్రతను, అలాగే ఇద్దరు అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్స్ మరియు సల్మాన్ యొక్క భద్రతా వివరాలలో 24 గంటలు తెలియజేసేలా 10 మంది కానిస్టేబుల్స్ లను కూడా సల్మాన్ ఇంటి చుట్టూ నియమించారు. అలాగే వార్నింగ్ ఇచ్చిన వారి పై కూడా ఎఫ్‌ఐఆర్ (FIR) ఫైల్ చేశారు.
Salman Khan: బాలీవుడ్ చేరిన బతుకమ్మ.. సల్మాన్ ఖాన్ మూవీలో అదరగొట్టిన తెలంగాణ సాంగ్!
కానీ సల్మాన్ ఖాన్ కి మాత్రం బెదిరింపులు తగ్గడం లేదు. దీంతో సల్మాన్ హై-ఎండ్ బులెట్ ప్రూఫ్ కారుని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. దక్షిణాసియా మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన SUVలలో ఒకటైన నిస్సాన్ పెట్రోల్ SUVని కొనుగోలు చేశాడట. ఈ మోడల్ కారు భారతదేశంలో అధికారిక లాంచ్ అవ్వలేదు. ఇక ఇండియాలో ఈ మోడల్ దొరక్కపోవడంతో సల్మాన్ ఫారిన్ నుంచి దిగుమతి చేయించుకుంటున్నాడు. తనకి వస్తున్న వార్నింగ్ లు వలనే ఈ కారును కొనుగోలు చేసుకుంటున్నట్లు సల్మాన్ తెలియజేశాడు.
కాగా ఈ వార్నింగ్స్ కి గల కారణం ఏంటంటే.. గతంలో సల్మాన్ కృష్ణ జింకల వేట కేసులో నిందుతుడిగా నిలిచి జైలుకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కమ్యూనిటీ కృష్ణ జింకలను పవిత్రంగా భావిస్తారు. అటువంటి జింకను సల్మాన్ వేటాడి చంపడంతో, లారెన్స్ అండ్ గ్యాంగ్ సల్మాన్ ని చంపాలనే నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి సల్మాన్ పై పలుమార్లు ఎటాక్ కోసం భారీ ప్లాన్ ని కూడా వేశారు.