Salman Khan : సింగర్ సిద్దూ హత్యతో సల్మాన్ ఖాన్‌కి సెక్యూరిటీ పెంపు..
ఇటీవల పంజాబీ సింగర్ సిద్దూ మూస్ వాలా హత్య జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ హత్యని గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్ చేపించాడని...............

Salmankhan
Salman Khan : ఇటీవల పంజాబీ సింగర్ సిద్దూ మూస్ వాలా హత్య జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ హత్యని గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్ చేపించాడని అతనే ఒప్పుకున్నాడు. లారెన్స్ ప్రస్తుతం తీహార్ జైలు లో ఉన్నాడు. లారెన్స్ కింద పని చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీంతో తీహార్ జైలు నుంచే పథకం పన్ని సిద్ధుని హత్య చేయించాడు లారెన్స్ బిష్ణోయ్. అయితే సిద్ధుని హత్య చేయడంతో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి సెక్యూరిటీ పెంచుతున్నారు.
సిద్ధుకి, సల్మాన్ కి లింక్ ఏంటి అని అనుకుంటున్నారా? వాళ్ళిద్దరికీ ఏ లింక్ లేదు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం లారెన్స్ బిష్ణోయ్ ఒక వీడియో సందేశంలో సల్మాన్ ఖాన్ ను చంపబోతున్నది తానే ప్రకటించాడు. అలాగే ఢిల్లీ పోలీసులు లారెన్స్ బిష్ణోయ్ ను 2018లో కోర్టుకు తరలిస్తూ ఉండగా కోర్టు బయట సల్మాన్ ను తాను చంపేస్తాను అంటూ ప్రకటించాడు. దీంతో తీహార్ జైలు లో ఉండి కూడా సింగర్ సిద్ధూని చంపాడు. అలాంటిది సల్మాన్ ని కూడా చంపితే పరిస్థితి ఏంటి అని అంతా ఆలోచిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవ్వడంతో లారెన్స్ నుంచి సల్మాన్ కి ముప్పు ఉండటంతో సల్మాన్ ఖాన్ కి సెక్యూరిటీని పెంచారు.
Vijay Babu: మళయాళం నటుడిపై రేప్ ఆరోపణలు
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సెక్యూరిటీని టైట్ చేయడంతో పాటు ముందస్తు అరెస్ట్ లు మరియు సోదాలు కూడా చేస్తున్నారు ముంబై పోలీసులు. సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కూడా పోలీసులని మోహరించారు. అక్కడ అనుమానాస్పదంగా ఎవరైనా కనపడితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు మహారాష్ట్ర పోలీసులు. అలాగే సల్మాన్ ఖాన్ ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పెంచారు. సల్మాన్ ఖాన్ షూటింగ్ ల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో, ప్రయాణించే సమయంలో కూడా మునుపటి కంటే ఎక్కవ జాగ్రత్తలు తీసుకుంటున్నాడని సమాచారం. సల్మాన్ కి గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ముప్పు ఉందని తెలియడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.