కరోనా- ‘సామజవరగమనా.. నేనిల్లు దాటగలనా!’.. వైరల్ అవుతున్న పేరడీ సాంగ్..

కరోనా వైరస్ నేపథ్యంతో రూపొందించిన పేరడీ సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

  • Published By: sekhar ,Published On : March 24, 2020 / 03:13 PM IST
కరోనా- ‘సామజవరగమనా.. నేనిల్లు దాటగలనా!’.. వైరల్ అవుతున్న పేరడీ సాంగ్..

Updated On : March 24, 2020 / 3:13 PM IST

కరోనా వైరస్ నేపథ్యంతో రూపొందించిన పేరడీ సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. రోజురోజుకీ మృతుల సంఖ్య, బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వాలు అయోమయానికి గురవుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇళ్లకే పరిమితమైన జనాలు టీవీ, సెల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కోవిడ్-19 గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పేరడీ పాటలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే ‘ముత్తు’ సినిమాలోని ‘థిల్లానా థిల్లానా’ పాట నెట్టింట్లో చక్కర్లు కొడుతుండగా తాజాగా ‘అల వైకుంఠపుకములో’ చిత్రంలోని ‘సామజవరగమనా’  పేరడీ సాంగ్ విపరీతంగా వైరల్ అవుతోంది.

Read Also : వైరల్ అవుతున్న హరీష్ శంకర్ ‘చైనా’ పురాణం..

‘నీ ముక్కు పట్టుకు వదలనన్నది చూడే ఆ వైరస్, నీ తుమ్ములను అలా వదిలి పెట్టకు దయలేదా ఓ మిస్‌.. నీ ఇంటికి కావలి కాస్తుందే ముప్పొద్దులా ఆ అంబులెన్స్.. నీ వాట్సప్‌లో లవ్ ఎమోజీనే పెడతానే ప్రామిస్.. సామజవరగమనా, నేను ఇల్లు దాట గలనా.. వయస్సు మీద వైరస్‌కున్న అదుపు చెప్పగలనా?’ అంటూ రూపొందించిన ఈ పాట నెటిజన్లను ఆకట్టుకుంటోంది.