నాగ్ ఉండగా ఇంకొకరు వంట చేయడమా?.. కుకింగ్‌లోనూ ‘కింగే’- కోడలు పిల్లకి వంట రాదు..

కోడలు సమంతతో పాటు తనకూ అంతగా వంట రాదని అమల తాజా ఇంటర్వూలో చెప్పారు..

  • Published By: sekhar ,Published On : April 14, 2020 / 01:36 PM IST
నాగ్ ఉండగా ఇంకొకరు వంట చేయడమా?.. కుకింగ్‌లోనూ ‘కింగే’- కోడలు పిల్లకి వంట రాదు..

Updated On : April 14, 2020 / 1:36 PM IST

కోడలు సమంతతో పాటు తనకూ అంతగా వంట రాదని అమల తాజా ఇంటర్వూలో చెప్పారు..

పెళ్లి తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్స్ సెలక్ట్ చేసుకుంటూ సినిమా సినిమాకి నటిగా మంచి పేరు తెచ్చుకుంటోంది సమంత అక్కినేని. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ అప్పుడప్పుడు వంటగది వైపు అడుగులేస్తోంది. అయితే కుటుంబ సభ్యుల కోసం సమంత ఇప్పటివరకు వంట చేయలేదట. అసలు తనకు వంట రాదట. ఈ విషయాన్ని స్వయంగా సామ్ అత్తగారు అమల చెప్పారు. తాజా ఇంటర్వూలో అమల.. నాగ్ మంచి కుక్ అని కితాబిచ్చారు. 

Akkineni
కుటుంబ సభ్యుల కోసం సమంత ఎప్పుడైనా వంట చేస్తారా?.. అని  ఓ మీడియా ప్రతినిధి అమలను అడగ్గా.. ‘లేదు.. కోడలు పిల్లపై కంప్లైంట్ చేయడం నా ఉద్దేశం కాదు.. నిజం చెప్పాలంటే నాకూ అంతగా వంట రాదు. అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున లాంటి మంచి కుక్ ఉన్నారు. అంత మంచి కుక్ ఉండగా వంట కోసం ఇంకొకరెందుకు?’ అంటూ నాగ్ నటనలోనే కాదు.. వంటలోనూ మంచి దిట్ట అని చెప్పుకొచ్చారు అమల..

Akkineni

తండ్రిలానే చైతు కూడా మంచి వంటగాడేనండోయ్.. ఈ విషయం పలుమార్లు సామ్ చెప్పడమే కాక చై కుక్ చేస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వంట వచ్చిన నాగ్, చైతులు దొరకడం అమల, సమంతల అదృష్టం అంటున్నారు అక్కినేని అభిమానులు.

Read Also : ప్రముఖ రచయిత సి.ఎస్.రావు ఇకలేరు..