వావ్… సమంత స్టంట్ ఎలా చేసిందో చూశారా?

అక్కినేని సమంతా చేసే స్టంట్ చూశారా? ఇంత సింపుల్ గా స్టంట్ చేయడం చూస్తే.. ఎవ్వరైనా వావ్ అని నోరు తెరవాల్సిందే. సమంతా జిమ్‌లో చేసే వర్కవుట్స్‌కి సంబంధించిన వీడియోలని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో సామ్ తాజాగా స్టంట్ చేస్తున్న ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
ఈ వీడియోలో సమంతా రెండు చేతులతో పోల్స్ ని పట్టుకొని సింపుల్ గా పైకి ఎక్కేస్తుంది. అంతేకాకుండా…కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఎప్పుడూ వెనకడుగు వేయకండి.. మీ టాలెంట్ ఏమిటో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు అంటూ సూపర్ గా క్యాప్షన్ ఇచ్చింది.
ఇక సామ్ చేసిన స్టంట్ వీడియోని చూసి నమ్రత, కాజల్, పూజా హెగ్డే, సుశాంత్ తదితర ప్రముఖులు అంతా షాక్ అయ్యారు. అంతేకాదు సమంత అమేజింగ్ అని కామెంట్స్ కూడా పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.