Samantha : నాకు అన్ని ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నాను.. కానీ ఆ టైంలో చాలా స్ట్రగుల్ అయ్యాను.. 

శాకుంతలం చిత్రయూనిట్ నిర్వహించిన ఈ ప్రెస్ మీట్ లో సమంత, దిల్ రాజు, గుణశేఖర్ పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు వీరు సమాధానాలు చెప్పారు.

Samantha : నాకు అన్ని ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నాను.. కానీ ఆ టైంలో చాలా స్ట్రగుల్ అయ్యాను.. 

Samantha comments in Shakunthalam Movie Press meet

Updated On : April 11, 2023 / 6:51 AM IST

Samantha :  సమంత మయోసైటిస్ నుంచి కోలుకున్నాక ఫుల్ జోష్ తో కంబ్యాక్ ఇచ్చింది. ఓ పక్క ఖుషి(Kushi), సిటాడెల్(Citadel) షూటింగ్స్ తో బిజీగా ఉంటూనే శాకుంతలం(Shakunthalam) సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటుంది. మన పురాణాల్లోని దుశ్యంతుడు-శకుంతల కథ ఆధారంగా గుణశేఖర్(GunaSekhar) దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న పాన్ ఇండియా(Pan India) రిలీజ్ కాబోతుంది. దీంతో సమంత, చిత్రయూనిట్ ఇండియా అంతటా ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. తాజాగా సోమవారం(మార్చ్ 10)న హైదరాబాద్(Hyderabad) లో ప్రెస్ మీట్ నిర్వహించారు చిత్రయూనిట్.

శాకుంతలం చిత్రయూనిట్ నిర్వహించిన ఈ ప్రెస్ మీట్ లో సమంత, దిల్ రాజు, గుణశేఖర్ పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు వీరు సమాధానాలు చెప్పారు. ఈ ప్రెస్ మీట్ లో సమంత సినిమా గురించి మాట్లాడుతూ.. నా చిన్నప్పుడు ఈ కథ విన్నాను, దీని గురించి నాకు కొంత తెలుసు. నా ప్రతీ సినిమాకు ది బెస్ట్ ఇవ్వడానికి కృషి చేస్తాను. మొదట నేను ఈ క్యారెక్టర్ చేయడానికి భయపడ్డాను. పాన్ ఇండియా సినిమాకు నా బెస్ట్ ఇవ్వడం కోసం ఎంతో కృషి చేశాను. ఈ సినిమాలో అర్హ స్క్రీన్ మీద కనపడినప్పుడు అందరి ముఖాలలో నవ్వు కనపడుతుంది అని తెలిపింది.

Samantha comments in Shakunthalam Movie Press meet

Anupama Parameswaran : సినిమాటోగ్రాఫర్ గా మారిన అనుపమ పరమేశ్వరన్.. ఆ సినిమా చూశారా?

ఇక ఇటీవల తన లైఫ్ లో ఫేస్ చేసిన పరిస్థితులపై మాట్లాడుతూ.. ఒకప్పుడు నాకు అన్ని ఉన్నప్పుడు నేను చాలా హ్యాపీగా వున్నాను. ఆ తర్వాత నాకు ఎదురైన స్ట్రగులింగ్ సమయంలో నేను మొదట బాధపడ్డా తర్వాత చాలా స్ట్రాంగ్ అయ్యాను. నాకు హెల్త్ బాగోనప్పుడు షూటింగ్ కి రావాలి అని ఎవ్వరూ ఫోర్స్ చేయలేదు, నా నిర్మాతలంతా నాకు సపోర్ట్ చేశారు అని తెలిపింది.