Samantha: చాలా రోజుల తరువాత మీ ముందుకు వచ్చాను: సమంత

తెలుగు ప్రేక్షకులే తన ఫ్యామిలీ అని సమంత చెప్పారు.

Samantha: చాలా రోజుల తరువాత మీ ముందుకు వచ్చాను: సమంత

Updated On : October 8, 2024 / 7:30 PM IST

అలియాభట్‌, వేదాంగ్‌ రైనా ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకున్న జిగ్రా సినిమా అక్టోబర్‌ 11న విడుదల కానున్న నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో అలియా భట్, సమంత, రానా దగ్గుబాటి, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాహుల్ రవీంద్రన్, వేదాంగ్ రైనా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ… హీరోయిన్స్‌కి ఎంతో బాధ్యత ఉంటుందని అన్నారు. ప్రతి అమ్మాయి కథలో ఆ అమ్మాయే హీరో అని చెప్పారు. చాలా రోజుల తరువాత మీ ముందుకు వచ్చానని, జిగ్రా మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు.

ప్రతి అమ్మాయికి రానా లాంటి బ్రదర్ ఉండాలని, తెలుగు ప్రేక్షకులే తన ఫ్యామిలీ అని సమంత చెప్పారు. కాగా, యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న జిగ్రా సినిమాకు వాసన్‌ బాలా దర్శకత్వం వహించారు. తమ్ముడి కోసం అక్క చేసే పోరాటంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది.

The Raja Saab : రాజా సాబ్ మేకింగ్ వీడియో చూసారా? మారుతి తో ప్రభాస్ సందడి..